నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్

తన కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ చూశాడు నితిన్. అతడు నటించిన భీష్మ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సంక్రాంతి తర్వాత మరో పెద్ద సినిమా క్లిక్ అవ్వకపోవడం, థియేటర్లు కూడా ఖాళీగా ఉండడం నితిన్ కు కలిసొచ్చింది. అందుకే 3 ఫ్లాపుల తర్వాత, ఏడాదిన్నర గ్యాప్ తర్వాత కూడా భారీ ఓపెనింగ్స్ రాబట్టుకోగలిగాడు.

నిన్న రిలీజైన భీష్మ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల 32 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నితిన్ కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్ ఇది. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ సినిమాకు 8 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి కొద్దిసేపట్లో కలెక్షన్ల పోస్టర్ కూడా బయటకురాబోతోంది.

తెలుగు రాష్ట్రాల్లో భీష్మ సినిమాను హయ్యర్స్ తో కలుపుకొని 19 కోట్ల రూపాయలకు అమ్మారు. తొలిరోజే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. దీంతో ఈరోజు, రేపు వసూళ్లు బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న టాక్ తో మరో వారం రోజులు నడిస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 2.25 కోట్లు
సీడెడ్ -రూ. 0.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.62 కోట్లు
ఈస్ట్ – రూ. 0.67 కోట్లు
వెస్ట్ – రూ. 0.56 కోట్లు
గుంటూరు – రూ. 0.77 కోట్లు
నెల్లూరు – రూ. 0.29 కోట్లు
కృష్ణా – రూ. 0.40 కోట్లు