ట్రంప్ తో విందుకు కేసీఆర్….

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు మోడీ సర్కారు వందల కోట్లు ఖర్చు చేస్తూ హంగామా చేస్తూ…. ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్ పర్యటనను మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ ఈ నెల 25న విందు ఇస్తున్నారు. ఈ విందుకు దేశంలోని 8 మంది ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపారు. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉండడం విశేషం.

ట్రంప్ తో విందులో పాల్గొనాల్సిందిగా కేసీఆర్ కు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. మొత్తం 95మందిని మాత్రమే ఈ విందుకు ఆహ్వానించినట్టు తెలిసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు మహారాష్ట్ర, హర్యానా, బీహార్, ఒడిషా, కర్ణాటక ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది.

ట్రంప్ రెండు రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. ఢిల్లీ, అహ్మదాబాద్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.