ఇంతకంటే మంచి ఫొటో దొరకలేదా కాజల్

శివరాత్రి సందర్భంగా మోసగాళ్లు అనే సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాకు సంబంధించి ఇప్పటికే మంచు విష్ణు లుక్ రిలీజవ్వగా, ఇప్పుడు కాజల్ లుక్ విడుదల చేశారు. అయితే ప్రశంసల మాట పక్కనపెట్టి, ఆ లుక్ పై ట్రోలింగ్ మాత్రం విపరీతంగా జరుగుతోంది.

ఓ సాధారణ ఫొటో షూట్ కోసం తీసిన ఫొటోలా ఉంది ఆ ఫస్ట్ లుక్. అందులో ఎలాంటి కొత్తదనం లేదు. ఇంకా చెప్పాలంటే ఓ బట్టల కంపెనీ కోసం తీసిన ఫొటోలా ఉంది తప్ప, సినిమా ఫీల్ ను ఎలివేట్ చేసేలా లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, సోషల్ మీడియాలో కాజల్ ను ట్రోల్ చేస్తున్నారు నెజిటన్లు.

అవకాశాలు లేకపోతే ఇంట్లో కూర్చో, అంతేకానీ ఇలాంటి సినిమాల్లో నటించి ఉన్న పేరు పాడు చేసుకోకంటూ కాజల్ కు సలహాలు ఇస్తున్నారు నెటిజన్లు. డబ్బుల కోసం ఏ సినిమా పడితే అది ఒప్పుకుంటే ఇలానే ఉంటుందంటూ మరికొందరు రాసుకొచ్చారు. మొత్తమ్మీద లుక్ బాగుందని చెప్పేవారే కరువయ్యారు.

చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మంచు విష్ణు నటిస్తున్న సినిమా ఇది. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మంచు విష్ణు భార్య మంచు వెరోనికా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సమ్మర్ లోనే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ తో ఆకట్టుకోలేకపోయిన కాజల్.. కనీసం సినిమాలోనైనా మెప్పిస్తుందేమో చూడాలి.