Telugu Global
CRIME

యాదాద్రి జిల్లాలో విషాదం... ముగ్గురు జలసమాధి !

పక్క ఊరికి వెళ్లొస్తానని కారులో వెళ్లిన భర్త, కుమారుడు ఎంతకూ రాకపోయేసరికి ఆ ఇల్లాలు కంగారు పడింది. తన కుటుంబ సభ్యులతో గాలించినా ఆచూకీ దొరకలేదు. పోలీసులకు పిర్యాదు చేయగా వాళ్లు రాత్రంతా గాలిస్తూనే ఉన్నారు. కాని చివరకు వాళ్లు కారుతో సహా చెరువులో మునిగి చనిపోయారని తెలుసుకొని.. గ్రామమంతా విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే… యాదాద్రి భువనగిరి జిల్లా సర్నేనిగూడెం సర్పంచ్ రాణి భర్త మధు, వారి కుమారుడు మత్స్యగిరి, డ్రైవర్ శ్రీధర్‌రెడ్డి శుక్రవారం పని […]

యాదాద్రి జిల్లాలో విషాదం... ముగ్గురు జలసమాధి !
X

పక్క ఊరికి వెళ్లొస్తానని కారులో వెళ్లిన భర్త, కుమారుడు ఎంతకూ రాకపోయేసరికి ఆ ఇల్లాలు కంగారు పడింది. తన కుటుంబ సభ్యులతో గాలించినా ఆచూకీ దొరకలేదు. పోలీసులకు పిర్యాదు చేయగా వాళ్లు రాత్రంతా గాలిస్తూనే ఉన్నారు. కాని చివరకు వాళ్లు కారుతో సహా చెరువులో మునిగి చనిపోయారని తెలుసుకొని.. గ్రామమంతా విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే…

యాదాద్రి భువనగిరి జిల్లా సర్నేనిగూడెం సర్పంచ్ రాణి భర్త మధు, వారి కుమారుడు మత్స్యగిరి, డ్రైవర్ శ్రీధర్‌రెడ్డి శుక్రవారం పని మీద పక్క ఊరికి కారులో వెళ్లారు. తిరిగి రాత్రి వస్తుండగా ఎల్లంకి చెరువుకట్టపై కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి నేరుగా చెరువులోనికి దూసుకెళ్లింది. డోర్లు అన్నీ లాక్ అయి ఉండటంతో అవి తెరుకోలేదు. దీంతో వాళ్లు ఊపిరాడక కారులోనే మరణించారు.

కాగా, పక్క గ్రామానికి వెళ్లిన భర్త, కుమారుడు ఎంతకూ రాకపోయేసరికి సర్పంచ్ రాణి తన కుటుంబ సభ్యులతో కలిసి చుట్టుపక్కల గాలించింది. ఆ తర్వాత పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు రాత్రంతా వాళ్లు వెళ్లిన ఊరిలో, దారిలో గాలించారు. కాని తెల్లవారినా వారి జాడ కానరాలేదు. దీంతో ఎల్లంకి గ్రామంలోని సీసీ కెమేరా ఫుటేజీని పరిశీలించగా.. వారి కారు చెరువుకట్టపైకి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో అనుమానంతో గజ ఈత గాళ్లతో చెరువులో గాలించగా కారు లభ్యమైంది. దాన్ని తాళ్లతో వెలికితీయడంతో ముగ్గురి మృతదేహాలు అందులోనే ఉన్నాయి.

ఈ వార్త తెలుసుకుని గ్రామస్థులంతా విషాదంలో మునిగిపోయారు. పోలీసులు ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని ప్రాథమికంగా నిర్థారించారు.

First Published:  22 Feb 2020 10:43 AM GMT
Next Story