నా ప్రేమికుడు ఎక్కడ… మాధవీలత సెటైర్లు

మాజీ హీరోయిన్, ప్రస్తుతం బీజేపీ సభ్యురాలు మాధవీలత సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. గతేడాది ఓ ప్రముఖుడు తనకు ప్రపోజ్ చేశాడనేది ఆ పోస్ట్ సారాంశం.

ఓ పెద్ద మనిషి ఏకంగా వెడ్డింగ్ రింగ్ పట్టుకొని మాధవీలత దగ్గరకొచ్చాడట. నువ్వు లేకపోతే బ్రతకలేను అంటూ డైలాగులు చెప్పాడట. ఈ క్షణమే పెళ్లి చేసుకుంటానని అన్నాడట. తనను ఎన్నాళ్లు ప్రేమిస్తావని మాధవీలత అడిగితే జీవితాంతం ప్రేమిస్తానని, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తానని డైలాగ్స్ చెప్పాడట. కట్ చేస్తే, ఆ తర్వాత ఆ వ్యక్తి కనిపించలేదని చెప్పుకొచ్చింది మాధవీ లత.

ఆఖరి శ్వాస వరకు ప్రేమిస్తానని చెప్పిన వ్యక్తి కనిపించడం లేదని, కొంపదీసి ఆఖరి శ్వాస తీసేశాడా అనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది మాధవీలత. ఎవరికైనా ఆ వ్యక్తి కనిపిస్తే కాస్త చెప్పండి బాబులూ అంటూ ముగిసింది.

సుదీర్ఘంగా చెప్పుకొచ్చిన ఈ చిన్నది, ఆ పెద్ద మనిషి ఎవరనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. కేవలం ప్రేమ పేరుతో మోసపోవద్దనే ఉద్దేశంతోనే మహిళల్ని ఉద్దేశించి ఈ పోస్ట్ పెడుతున్నట్టు స్పష్టంచేసింది మాధవీలత.