కొత్త దర్శకుడితో మహేష్?

మహేష్ నెక్ట్స్ సినిమా ఏంటి?

ఈ ప్రశ్నకు ఎవరైన ఠక్కున వంశీ పైడిపల్లి పేరు చెబుతారు. ఆ సినిమాలో మహేష్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కూడా కనిపించబోతున్నాడంటూ కథనాలు వచ్చేశాయి. దిల్ రాజు, పీవీపీ, మహేష్ కలిసి ఆ సినిమాను నిర్మిస్తారని కూడా వార్తలు వచ్చేశాయి. కట్ చేస్తే, ఇప్పుడా ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టాడు మహేష్ బాబు.

అవును.. వంశీ పైడిపల్లి చెప్పిన ఫైనల్ నెరేషన్ మహేష్ కు నచ్చలేదు. దీంతో ఆ స్టోరీని పూర్తిగా పక్కన పెట్టేయమని పైడిపల్లికి సూచించాడట మహేష్. దీంతో వంశీ పైడిపల్లి ఇప్పుడు కొత్త స్టోరీలైన్లు రాసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో.. మహేష్ ను ఓ కొత్త కుర్రాడు బాగా ఎట్రాక్ట్ చేశాడట. నమ్రత రిఫరెన్స్ తో మహేష్ ను కలిసిన ఆ యంగ్ డైరక్టర్.. అదిరిపోయే స్టోరీలైన్ వినిపించాడట.

ఆ లైన్ బాగా నచ్చడంతో బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయమని మహేష్ సూచించాడు. సో.. ఇప్పుడు మహేష్ కు అటువైపు వంశీ పైడిపల్లి, ఇటువైపు కొత్త కుర్రాడు ఉన్నారు. వీళ్లలో ఎవరు ముందుగా మహేష్ ను మెప్పిస్తే వాళ్లతోనే సినిమా ఉంటుంది. ఈ గ్యాప్ లో మరో దర్శకుడు తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, సరిలేరు నీకెవ్వరు స్టార్ట్ అవ్వకముందు అనీల్ రావిపూడి అలానే తెరపైకి వచ్చాడు కదా.