బాహుబలిగా ట్రంప్.. అద్దిరిపోయే వీడియో.. సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశానికి వస్తున్న సందర్భంలో.. ఇండియా, అమెరికాల్లోనే కాదు… ప్రపంచ వ్యాప్తంగా ఎవరి నోట విన్నా.. ఇదే ముచ్చట వినిపిస్తోంది. ఇండియాలో ట్రంప్ ఏం చేయనున్నారు.. ట్రంప్ రాకతో ఇండియా ఏం చేయనుంది అన్న చర్చే ఉత్సాహంగా జరుగుతోంది.

ఈ సందర్భంగా.. ట్రంప్ బాహుబలిగా మారిపోయారు. కత్తులు, కటార్లతో యుద్ధం చేశారు. విజయగర్వంతో భార్యను, కూతురుని చూసి ఉప్పొంగిపోయారు. బాహుబలిలో ప్రభాస్ ను మించి కత్తి యుద్ధాలు ప్రదర్శించారు. యుద్ధంలో ప్రత్యర్థిని మట్టికరిపించారు. ఇంతగా ఒక ఔత్సాహికుడు చేసిన ప్రయత్నం.. ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్ సెన్సేషన్ అవుతోంది.

ఈ వీడియోను ఎడిట్ చేసిన వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. ఆ ట్వీట్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రీ ట్వీట్ చేయడం విశేషం. తన గొప్ప స్నేహితుడైన ఇండియాను కలిసేందుకు అమితాసక్తితో ఎదురుచూస్తున్నట్టు తన ట్వీట్ లో ట్రంప్ చెప్పారు. ఆ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.