భీష్మ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

ఎట్టకేలకు హిట్ కొట్టాడు నితిన్. 3 ఫ్లాపుల తర్వాత, సుదీర్ఘ విరామం తర్వాత ఈ హీరో చేసిన భీష్మ సినిమా సూపర్ హిట్టయింది. మొదటి రోజు హిట్ టాక్ రావడంతో శని, ఆదివారాలు ఈ సినిమాకు జనాలు పోటెత్తారు. మరీ ముఖ్యంగా సంక్రాంతి తర్వాత మరో మంచి సినిమా లేని లోటును భీష్మ భర్తీ చేసింది.

అలా సూపర్ హిట్ టాక్ తో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది భీష్మ. మొదటి వారాంతం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల 89 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… నైజాంలో ఈ సినిమా 3 రోజుల్లోనే బ్రేక్-ఈవెన్ సాధించడం. అవును.. దాదాపు 6 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి నైజాంలో ఇది బ్రేక్ ఈవెన్ అయింది. మిగతా అన్ని ఏరియాల్లో మరో 3 రోజుల్లో ఇది బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసిన భీష్మ.. రేపటికి మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరే అవకాశం ఉంది. నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా భీష్మ నిలిచే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 రోజుల్లో వచ్చిన షేర్స్ ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 5.93 కోట్లు
సీడెడ్ – రూ. 2.24 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.79 కోట్లు
ఈస్ట్ – రూ. 1.20 కోట్లు
వెస్ట్ – రూ. 0.88 కోట్లు
గుంటూరు – రూ. 1.37 కోట్లు
నెల్లూరు – రూ. 0.48 కోట్లు
కృష్ణా – రూ. 0.92 కోట్లు