Telugu Global
NEWS

తొలిటెస్టులో భారత్ నాలుగురోజుల్లోనే చిత్తు

10 వికెట్లతో అలవోకగా నెగ్గిన కివీస్ టెస్ట్ క్రికెట్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్…ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో తొలి ఓటమి చవిచూసింది. గత ఏడాది జరిగిన మూడు సిరీస్ లు, ఏడుటెస్టుల్లో భారీవిజయాలతో క్లీన్ స్వీప్ సాధించిన భారత్…2020 సీజన్ తొలి సిరీస్ తొలిటెస్టులో మాత్రం ఘోరపరాజయం చవిచూడాల్సి వచ్చింది. వెలింగ్టన్ బేసిన్ రిజర్వ్ పార్క్ వేదికగా జరిగిన ఐదురోజుల టెస్ట్ నాలుగోరోజు ఆటలోనే భారత్ చేతులెత్తేసింది. 10 బాల్స్ లోనే 10 వికెట్ల […]

తొలిటెస్టులో భారత్ నాలుగురోజుల్లోనే చిత్తు
X
  • 10 వికెట్లతో అలవోకగా నెగ్గిన కివీస్

టెస్ట్ క్రికెట్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్…ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో తొలి ఓటమి చవిచూసింది. గత ఏడాది జరిగిన మూడు సిరీస్ లు, ఏడుటెస్టుల్లో భారీవిజయాలతో క్లీన్ స్వీప్ సాధించిన భారత్…2020 సీజన్ తొలి సిరీస్ తొలిటెస్టులో మాత్రం ఘోరపరాజయం చవిచూడాల్సి వచ్చింది.

వెలింగ్టన్ బేసిన్ రిజర్వ్ పార్క్ వేదికగా జరిగిన ఐదురోజుల టెస్ట్ నాలుగోరోజు ఆటలోనే భారత్ చేతులెత్తేసింది. 10 బాల్స్ లోనే 10 వికెట్ల విజయం… స్వింగ్, సీమ్ బౌలింగ్ కు అనువుగా ఉన్న బేసిన్ రిజర్వ్ పార్క్ వికెట్ పైన కివీ సీమర్ల దళం బౌల్ట్, సౌథీ, జామీసన్, గ్రాండ్ హోమీ చెలరేగిపోయారు. కేవలం నాలుగురోజుల వ్యవధిలోనే పవరఫుల్ భారత్ ను రెండుసార్లు ఆలౌట్ చేయడం ద్వారా 20కి 20 వికెట్లు పడగొట్టగలిగారు.

183 పరుగుల తొలిఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ నాలుగోరోజు ఆటలో 191 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 58 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. విజయానికి అవసరమైన మొత్తం 10 పరుగులను కేవలం 10 బాల్స్ ఎదుర్కొనడం ద్వారా సాధించిన న్యూజిలాండ్ 10 వికెట్ల అలవోక విజయాన్ని సొంతం చేసుకొంది.

కివీ పేసర్ టిమ్ సౌథీ ..మ్యాచ్ రెండుఇన్నింగ్స్ లోనూ కలసి 7 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ కు ఇది వందో విజయం కావడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.

విరాట్ కొహ్లీ నిరాశ…

న్యూజిలాండ్ తో జరిగిన తొలిటెస్టులో తమజట్టు ఘోరపరాజయం పొందడం పట్ల కెప్టెన్ విరాట్ కొహ్లీ తీవ్రనిరాశను వ్యక్తం చేశాడు. టాస్ ఓడటమే తమ పరాజయానికి కారణమని చెప్పాడు.

బ్యాటింగ్ లో తాము ఘోరంగా విఫలమయ్యామని, మయాంక్ అగర్వాల్, అజింక్యా రహానేలు మినహా …మిగిలిన ఆటగాళ్లు రాణించలేకపోయారని వాపోయాడు.

ఆట అన్ని విభాగాలలోనూ న్యూజిలాండ్ తమకంటే మెరుగైన ఆటతీరు ప్రదర్శించిందని, ఈ ఓటమి తమజట్టుకు విలువైన ఓ పాఠమని కొహ్లీ తెలిపాడు.

సిరీస్ లోని రెండోటెస్టులో లోపాలు సవరించుకొని…న్యూజిలాండ్ కు గట్టిపోటీ ఇవ్వగలమన్న ధీమాను వ్యక్తం చేశాడు.

విలియమ్స్ సన్ సంతృప్తి…

భారత్ లాంటి బలమైన జట్టును కేవలం నాలుగురోజుల్లోనే చిత్తు చేయడం పట్ల కివీ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ సంతృప్తివ్యక్తం చేశాడు. తమజట్టు బౌలింగ్ తో పాటు.. ఫీల్డింగ్ లోనూ అత్యుత్తమంగా రాణించడం గర్వకారణమని, ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ ను తొలి ఇన్నింగ్స్ లో 165, రెండో ఇన్నింగ్స్ లో 191 పరుగులకు ఆలౌట్ చేయడమే తమ విజయానికి కారణమని వివరించాడు. సిరీస్ లోని రెండోటెస్ట్ మ్యాచ్ క్రైస్ట్ చర్చి వేదికగా ఈనెల 29న ప్రారంభమవుతుంది.

First Published:  23 Feb 2020 8:20 PM GMT
Next Story