బ్రేకింగ్: చిరంజీవి సినిమాలో మహేష్ బాబు?

దర్శకుడు కొరటాల శివకు సూపర్ స్టార్ మహేష్ బాబుకు మంచి సాన్నిహిత్యం ఉంది. రెండు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన కొరటాల అంటే మహేష్ కు అంతులేని అభిమానం అని చాలా చోట్ల చెప్పుకొచ్చాడు.

ఇక తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా చిరంజీవి వచ్చాడు. మహేష్ తో కలిసి సందడి చేశారు. దీన్ని చూసిన అభిమానులు ఫిదా కాగా.. సినిమాలో కూడా చూపించే ప్రయత్నానికి కొరటాల చేస్తున్నాడని టాక్.

కొరటాల శివ రూపొందిస్తున్న చిరంజీవి సినిమాలో ‘మహేష్ బాబు’ గెస్ట్ రోల్ చేయబోతున్నాడని తాజాగా బ్రేకింగ్ న్యూస్ ఫిలింనగర్ నుంచి వస్తోంది.

చిరంజీవితో సినిమాలో ఓ కీలకమైన పాత్రను పోషించడానికి చరిష్మా ఉన్న నటుడు అవసరం అని కొరటాల భావించాడట.. ఈ మేరకు తాజాగా మహేష్ బాబును కలిసి ఈ పాత్రను చేయాలని కోరాడట.. ముందు పవన్ ను అనుకున్నారు. కానీ చిరు సూచన మేరకు మహేష్ ను సీన్ లోకి తీసుకొస్తున్నట్టు సమాచారం.

ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. ఇంటర్వెల్ అయ్యాక.. వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో చిరంజీవి, మహేష్ కనిపింబోతున్నట్టు టాక్. మెగాస్టార్, సూపర్ స్టార్ కనుక ఒకే సినిమాలో కనిపిస్తే… భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. వీరి కాంబినేషన్ సెట్ అవుతుందా? మహేష్ నటిస్తాడా? అన్నది ఇప్పుడు అభిమానులకు గూస్ బాంబ్స్ తెప్పిస్తోంది.