ట్రంప్ విందును రాజకీయం చేసిన చంద్రబాబు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం సాయంత్రం భారీ విందు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. ఏపీ సీఎం జగన్ కు ఆహ్వానం రాలేదు.

అయితే తాజాగా దీన్ని కూడా రాజకీయం చేశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. జగన్ కు ఆహ్వానం రాకపోవడంపై తన అక్కసు వెళ్లగక్కారు. ప్రపంచంలో, దేశంలో ఏం జరిగినా ఏపీ సీఎం జగన్ కు ముడిపెట్టి తన కోపాన్ని అంతా చంద్రబాబు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఏమీ చేయలేకపోతున్న బాబుకు… ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై మాట్లాడడం శోచనీయంగా మారింది.

చిత్తూరు జిల్లాలో కార్యకర్తలతో మాట్లాడిన చంద్రబాబు ఈ మేరకు వైఎస్ జగన్ ఎంత కేంద్రంతో చెలిమిగా ఉన్నా ఆయనను కేంద్రం దూరంగా పెడుతుందనేదానికి విందుకు పిలవకపోవడమే నిదర్శనమన్నారు.

ఇక జగన్ గురించి ఆడిపోసుకున్న చంద్రబాబు… తనపైనా కేసులున్న విషయం మరిచిపోయాడని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన అవినీతిపరుడు చంద్రబాబు అని… ఆయనా మాకు నీతులు చెప్పేదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబులా లాబీయింగ్ లు చేసే మనస్తత్వం జగన్ కు లేదని.. కొత్త ముఖ్యమంత్రి కావడంతో విందుకు ఆహ్వానం అందలేదని చెప్పుకొచ్చారు.