పుకార్లను పరోక్షంగా ఖండించిన మెహ్రీన్

రెమ్యూనరేషన్ కాకుండా అదనంగా మెహ్రీన్ చాలా చార్జ్ చేస్తోందట. ఫుడ్ బిల్, ల్యాండ్రీ బిల్ అంటూ లక్షల్లో నిర్మాతల దగ్గర పిండేస్తోందట. గడిచిన 2 రోజులుగా మెహ్రీన్ పై వస్తున్న పుకార్లు ఇవి. మరీ ముఖ్యంగా మెహ్రీన్ వ్యవహారశైలితో అశ్వథ్థామ నిర్మాతలు బాగా ఇబ్బంది పడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై పరోక్షంగా స్పందించింది మెహ్రీన్.

“మహిళా సాధికారిత మీద సినిమాలు తీస్తారు, బయట మాత్రం మహిళల్ని కించపరిచేలా ప్రవర్తిస్తారు. ఇలా చేయడం వల్ల ఏం ఉపయోగం. నా ప్రతిష్ట, గౌరవానికి భంగం కలిగినప్పుడు నేను తప్పకుండా నిలబడతాను. వృత్తి పరంగా జీవితానికి, ఎదుటి వ్యక్తి గోప్యతకు నేను గౌరవం ఇస్తాను.”

ఇలా పుకార్లపై పరోక్షంగా స్పందించింది మెగ్రీన్. తన గౌరవానికి భంగం వాటిల్లేలా వార్తలు వస్తున్నాయని, వాటిని తను ఎదుర్కొంటాను అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతోంది మెహ్రీన్. మరీ ముఖ్యంగా ఎఫ్2 సక్సెస్ తర్వాత ఆమెకు ఆఫర్లు ఎక్కువయ్యాయి. ఇలాంటి టైమ్ లో తన వ్యవహారశైలి బాగాలేదంటూ కథనాలు రావడాన్ని మెహ్రీన్ సీరియస్ గా తీసుకుంది. తాజా పరిణామాల వల్ల ఆమె భవిష్యత్తులో మరోసారి నాగశౌర్యతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం లేనట్టే.