ఆ వార్తలతో దిల్ రాజ్ హర్ట్ అయ్యాడా?

దిల్ రాజు.. ఇప్పుడు టాలీవుడ్ లోనే అగ్రనిర్మాత.. టాలీవుడ్ ను శాసించగల స్థాయి వ్యక్తిగా ఎదిగిపోయాడు. అయితే ఈ స్టార్ ప్రొడ్యూసర్ తో సినిమాలు తీయడానికి స్టార్ హీరోలు కూడా కాదనకుండా డేట్స్ ఇస్తుంటారు. సినిమాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన దిల్ రాజుకు పర్సనల్ జీవితంలో మాత్రం ఎదురుదెబ్బలు తగిలాయి. ఆయన భార్య గత ఏడాది గుండెపోటుతో మరణించడంతో దిల్ రాజు కృంగిపోయారు.

ప్రస్తుతం సినిమా పనులతో బిజీగా ఉన్నా… ఇంట్లో మాత్రం ఆయనకు భార్య లేని లోటు అయితే కనిపిస్తోందట.. అందుకే ఆయన కూతురు, అల్లుడు కలిసి ఏరికోరి ఓ అమ్మాయిని చూసి దిల్ రాజుకు పెళ్లి చేయాలని చూశారని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఆయన రహస్యంగా పెళ్లి చేసుకున్నారని.. రెండో పెళ్లి కావడంతో ఫోకస్ కాకుండా సైలెంట్ గా కానిచ్చేశాడని వార్తలు వచ్చాయి. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఈ మేరకు కథనం ప్రచురించింది.

దీనిపై దిల్ రాజ్ మనస్థాపం చెందినట్టు తెలిసింది. దొంగచాటుగా పెళ్లి చేసుకోవాల్సినంత ఖర్మ తనకు పట్టలేదని వాపోయినట్టు సమాచారం. అందరికీ చెప్పే చేసుకుంటానని.. తనకెందుకు సిగ్గు అని.. ఇలా వార్తలు రాసి తన వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మీడియా తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.