Telugu Global
NEWS

త్వరలోనే ఇంటర్ పరీక్షలు... నిఘా పెట్టనున్న సీసీ కెమెరాలు

మార్చి 4 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏర్పాట్లు.. ఈ సారి పరీక్షల నిర్వహణలో భాగం కానున్నాయి. విద్యార్థులకు సకాలంలో హాల్ టికెట్ల జారీ మొదలు.. పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా పరీక్షల నిర్వహణ వరకు.. ఏర్పాట్లు జరుగతున్నాయి. గతంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మాల్ ప్రాక్టీస్ ఆరోపణలు వెలుగుచూసిన నేపథ్యంలో.. ఈ సారి అలా కాకుండా పటిష్ట బందోబస్తుకు ప్రణాళిక సిద్ధమైంది. ప్రభుత్వం ఈ సారి అమలు చేస్తున్న విధానాల్లో […]

త్వరలోనే ఇంటర్ పరీక్షలు... నిఘా పెట్టనున్న సీసీ కెమెరాలు
X

మార్చి 4 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏర్పాట్లు.. ఈ సారి పరీక్షల నిర్వహణలో భాగం కానున్నాయి. విద్యార్థులకు సకాలంలో హాల్ టికెట్ల జారీ మొదలు.. పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా పరీక్షల నిర్వహణ వరకు.. ఏర్పాట్లు జరుగతున్నాయి. గతంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మాల్ ప్రాక్టీస్ ఆరోపణలు వెలుగుచూసిన నేపథ్యంలో.. ఈ సారి అలా కాకుండా పటిష్ట బందోబస్తుకు ప్రణాళిక సిద్ధమైంది.

ప్రభుత్వం ఈ సారి అమలు చేస్తున్న విధానాల్లో వినూత్నమైంది.. ఆన్ లైన్ లోనే హాల్ టికెట్ల జారీ. చాలావరకు ప్రవేశ పరీక్షలకు మాత్రమే ఈ విధానం అమలులో ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ విధానాన్ని అమలు చేయడమే కాదు.. విద్యార్థి రిజిస్టర్డ్ మొబైల్ కు పరీక్ష కేంద్రం, హాల్ టికెట్ నంబర్ వచ్చే ఏర్పాట్లు చేశారు అధికారులు. పరీక్షా కేంద్రంలోని గది నంబర్ ను కూడా మెసేజ్ లో పంపేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జంబ్లింగ్ ద్వారా పరీక్షల నిర్వహణ కొన్నేళ్లుగా అమల్లో ఉంది. ఈ విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారు. విద్యార్థులకే కాదు.. ఇన్విజిలేటర్లకూ జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. ఓ కళాశాలకు చెందిన సిబ్బంది.. అదే కళాశాలలో విధులు నిర్వర్తించకుండా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఫలితంగా.. అక్రమాలకు అవకాశాలు ఉండవని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు.

ఇక.. మరో ముఖ్యమైన చర్యలో ఒకటి.. సీసీ కెమెరాలతో పరీక్షల నిర్వహణపై నిఘా. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి.. వాటితో పరీక్షల సమయంలో ప్రతి క్షణం నిఘా పెట్టడం ద్వారా.. మాల్ ప్రాక్టీసింగ్ మాత్రమే కాదు.. ఇన్విజిలేటర్లు కూడా అప్రమత్తంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం.. ఈ చర్యలో ముఖ్య ఉద్దేశం. ఇంతగా గతంలో అయితే పటిష్టమైన ఏర్పాట్లు లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ చర్యలపై ప్రశంసలు వినిపిస్తున్నాయి.

First Published:  25 Feb 2020 9:05 PM GMT
Next Story