రష్మిక స్థానంలో పూజా హెగ్డే

పెద్ద హీరోలు ఎవరైనా సినిమా చేస్తున్నారంటే హీరోయిన్ విషయంలో వాళ్లకు రెండంటే రెండు ఆప్షన్లు మాత్రమే కనిపిస్తున్నాయి. తీసుకుంటే రష్మికను తీసుకోవాలి, లేదంటే పూజా హెగ్డేను తీసుకోవాలి. ఇలా టాలీవుడ్ ను ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఏలుతున్నారు.

రాశిఖన్నా లాంటి హీరోయిన్లు ఉన్నప్పటికీ.. వాళ్లు కొందరు హీరోలకు మాత్రమే పరిమితమైపోయారు. దీంతో రష్మిక-పూజా మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ నడుస్తోంది. ఈ క్రమంలో రష్మిక చేయాల్సిన ఓ పాత్రను పూజా హెగ్డే ఎగరేసుకుపోయింది.

నాగచైతన్య-పరశురామ్ కాంబినేషన్ లో సినిమా సెట్టయిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఇందులో హీరోయిన్ గా రష్మికను దాదాపు ఫిక్స్ చేశారు. ఎందుకంటే, గీతగోవిందం సినిమాలో పరశురామ్ తో కలిసి పనిచేసింది రష్మిక. ఆ సినిమా పెద్ద హిట్టవ్వడంతో రష్మికను పరశురాం సెంటిమెంట్ గా ఫీల్ అయి, చైతూ సినిమాకు కూడా ఆమెనే రిపీట్ చేశాడు.

కాకపోతే ఊహించని విధంగా ఇప్పుడీ ప్రాజెక్ట్ నుంచి రష్మిక తప్పుకుంది. ఆమె స్థానంలో పూజా హెగ్డేను తీసుకోవాలని అనుకుంటున్నారు. దీని వెనక ఓ బలమైన కారణం కూడా ఉంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో సినిమా రెడీ అవుతోంది. అందులో పూజా హెగ్డేకు స్థానం లేదు. ఎందుకంటే హీరో-దర్శకుడు ఇద్దరూ ఆమెతో సినిమాలు చేసేశారు. కొత్తదనం కోసం రష్మికను అనుకుంటున్నారు. సో.. రష్మిక అటు జంప్ అయింది, పూజా హెగ్డే ఇటొచ్చింది. అదన్నమాట సంగతి.