ట్రంప్ తో బాలయ్యకు పోలిక.. వైరల్ న్యూస్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన భారత్ లో రెండో రోజు హాట్ టాపిక్ గా మారింది. జాతీయ, అంతర్జాతీయ చానెళ్లన్నీ ఆయన పర్యటనపైనే రోజంతా కార్యక్రమాలతో నింపేస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ట్రంప్ మేనియానే. అయితే తాజాగా సోషల్ మీడియాలో ట్రంప్, టాలీవుడ్ హీరో, ఎమ్మెల్యే బాలయ్య పోలిక ఒకటి వైరల్ గా మారింది.

నందమూరి బాలయ్య ఎమ్మెల్యేగా చేసిన సంతకాన్ని.. ట్రంప్ గాంధీజీ సబర్మతి ఆశ్రయాన్ని, తాజ్ మహల్ సందర్శించాక చేసిన సంతకాన్ని కలిపి నెటిజన్లు వైరల్ చేశారు. ట్రంప్ , బాలయ్య సంతకాలు ఒకేలా ఉన్నాయని.. వీటిని ఎవరూ కాపీ చేయలేరంటూ నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.

బాలయ్యకు, ట్రంప్ కు సాటి లేదని.. ఇద్దరూ సేమ్ టు సేమ్ సంతకాలు చేశారని కొనియాడుతున్నారు. బాలయ్య ఫ్యాన్స్ అయితే దీన్ని తెగ వైరల్ చేస్తున్నారు.

ట్రంప్, బాలయ్యల సంతకాలు యాధృచ్ఛికంగా ఒకేలా ఉండడం.. ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఇద్దరి సంతకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మా బాలయ్య గ్రేట్ అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.