ట్రంప్ టూర్.. రాజమౌళిని ఇరికించిన రాంగోపాల్ వర్మ

దర్శకుడు రాజమౌళి తన మానాన తను ‘ఆర్ఆర్ఆర్’సినిమా తీసుకుంటూ సైలెంట్ గా పనిచేసుకుంటున్నారు. వివాదాలకు దూరంగా ఉండే రాజమౌళి ఈ మధ్యనే ‘వర్మ తాతయ్య’ అంటూ ట్వీట్ చేశారు. రాంగోపాల్ వర్మ కూతురికి బిడ్డ పుట్టడంతో వర్మ తాతా అంటూ ముద్దుగా పిలిచి ఏడిపించారు.

ఆ ట్వీట్ సెటైర్ ను మనుసులో పెట్టుకున్నారేమో రాంగోపాల్ వర్మ తాజాగా ట్రంప్ పర్యటన నేపథ్యంలో రాజమౌళిని అడ్డంగా బుక్ చేశాడు. ట్రంప్ పర్యటనపై దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా ఈ వివాదంలో దర్శక ధీరుడు, బాహుబలి దర్శకుడు రాజమౌళిని లాగారు.

తాజాగా రాంగోపాల్ వర్మ చేస్తూ.. ‘ట్రంప్ ను ఆహ్వానించడానికి కోటి మందిని తెస్తానన్న మోడీ కేవలం లక్ష మందిని మాత్రమే తెచ్చాడని.. ఇది చూసి ట్రంప్ హర్ట్ అవ్వకూడదని.. ఆ బాధలో మనకు రావాల్సిన ఒప్పందాలు రద్దు చేసుకోకూడదంటే రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తే బాగుంటుంది. రాజమౌళి తన ప్రతిభను కంప్యూటర్ గ్రాఫిక్స్ ను ఉపయోగించి లక్షమందిని కాస్తా కోటి మందిగా చూపించాలని.. ఆ వీడియోను ట్రంప్ కు కానుకగా ఇస్తే బాగుంటుంది’ అని సెటైరికల్ గా ట్వీట్ చేశారు.

ఇలా తన పని తాను సైలెంట్ గా చేసుకున్న రాజమౌళిని కూడా వదలకుండా రాంగోపాల్ వర్మ ఇన్ వాల్వ్ చేశాడు. మరి వర్మ విసిరిన ఈ పంచులకు జక్కన స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.