బాబుకు షాకిచ్చిన వైసీపీ సర్కార్…

అమరావతే రాజధానిగా ఉండాలంటూ చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. ఇక విశాఖను పరిపాలన రాజధానిగా చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాడు. అలాంటి చంద్రబాబు విశాఖ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది.

విశాఖను రాజధానిగా ఒప్పుకోని చంద్రబాబు ఇక్కడికి రావడాన్ని ఉత్తరాంధ్ర వాసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కోసం విశాఖ పట్నం ఎయిర్ పోర్టుకు రాగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ నేతలు, ఇతర ప్రజాసంఘాల నేతలు పెద్ద ఎత్తున విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఇక చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు.

చంద్రబాబును అడ్డుకోవాలని వైసీపీ, ప్రజాసంఘాల నేతలు ఫ్లకార్డులతో రెడీ అయ్యారు. బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా టీడీపీ కార్యకర్తలు జై చంద్రబాబు అనడంతో… ఇరు పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

ఈ నేపథ్యంలోనే వైసీపీ సర్కారు చంద్రబాబుకు షాకిచ్చింది. బాబు విశాఖలో తలపెట్టిన ర్యాలీకి అనుమతిని నిరాకరించింది. ఉద్రిక్త పరిస్థితి దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని… పోలీసులు చంద్రబాబు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. దీనిపై చంద్రబాబు, టీడీపీ నేతలు తీవ్ర నిరసన తెలిపారు.