Telugu Global
NEWS

లక్ష్మీపార్వతికి అరుదైన అవకాశం...

తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు భార్యగా లక్ష్మీపార్వతి ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్ చివరిరోజుల్లో టీడీపీని లాక్కున్న చంద్రబాబు ఉదంతంలో సాక్షిగా ఈమెనే ఉన్నారు. ఇప్పటికీ చంద్రబాబును వ్యతిరేకిస్తూ మాటల తూటాలు పేల్చుతుంటారు. అయితే లక్ష్మీపార్వతి కేవలం రాజకీయ నాయకురాలే కాదు… ఆమె ఒక సాహిత్య మేధావి, కళాకారురాలు కూడా. ఈమెకు కళలు, సాహిత్యంలో ఉన్న పట్టు చూసే ఎన్టీఆర్ భార్యగా స్వీకరించారు. ఉన్నత విద్య చదివిన లక్ష్మీపార్వతి తెలుగు లిటరేచర్ చేసి తెలుగు […]

లక్ష్మీపార్వతికి అరుదైన అవకాశం...
X

తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు భార్యగా లక్ష్మీపార్వతి ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్ చివరిరోజుల్లో టీడీపీని లాక్కున్న చంద్రబాబు ఉదంతంలో సాక్షిగా ఈమెనే ఉన్నారు. ఇప్పటికీ చంద్రబాబును వ్యతిరేకిస్తూ మాటల తూటాలు పేల్చుతుంటారు.

అయితే లక్ష్మీపార్వతి కేవలం రాజకీయ నాయకురాలే కాదు… ఆమె ఒక సాహిత్య మేధావి, కళాకారురాలు కూడా. ఈమెకు కళలు, సాహిత్యంలో ఉన్న పట్టు చూసే ఎన్టీఆర్ భార్యగా స్వీకరించారు. ఉన్నత విద్య చదివిన లక్ష్మీపార్వతి తెలుగు లిటరేచర్ చేసి తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారు. సాహిత్యంపై పట్టు ఎక్కువ.

అందుకే లక్ష్మీపార్వతి భాషాభిమానాన్ని, కళలపై మక్కువను చూసే సీఎం జగన్ ఆమెకు ‘తెలుగు అకాడమీ చైర్మన్’ పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు ఆమె అభిరుచికి తగిన జాబ్ ఒకటి ఆమెను వెతుక్కుంటూ వచ్చింది.

తాజాగా తెలుగు అకాడమీ చైర్మన్ అయిన లక్ష్మీపార్వతికి… విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. విజిటింగ్ ప్రొఫెసర్ గా విద్యార్థులకు బోధించాలని కోరింది. దీనికి లక్ష్మీపార్వతి సంతోషంగా ఒప్పుకుందట.. చదువు చెప్పడం.. తెలుగు భాషను పాఠాలుగా బోధించడం అంటే తనకు చాలా ఇష్టమని, తాను అధ్యాపకురాలిగా సేవలందిస్తానని చెప్పిందట. ఇలా లక్ష్మీపార్వతి ఇప్పుడు విశాఖలో కొత్త ఉద్యోగంలో చేరిపోతున్నారు.

First Published:  27 Feb 2020 12:48 AM GMT
Next Story