Telugu Global
NEWS

చంద్రబాబు కాన్వాయ్ పై కోడిగుడ్లు, చెప్పులతో దాడి... తీవ్ర ఉద్రిక్తత

అమరావతే రాజధానిగా ఉండాలని…. విశాఖ రాజధాని ప్రకటనను వ్యతిరేకించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం విశాఖలో పర్యటించిన చంద్రబాబు కాన్వాయ్ పై కొందరు కోడిగుడ్లు, చెప్పులతో దాడులకు దిగారు. టమాటాలను విసిరారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా చైతన్యయాత్రలను’ ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగానే విశాఖకు రాగా.. విశాఖను వ్యతిరేకించిన చంద్రబాబుకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు ఎయిర్ […]

చంద్రబాబు కాన్వాయ్ పై కోడిగుడ్లు, చెప్పులతో దాడి... తీవ్ర ఉద్రిక్తత
X

అమరావతే రాజధానిగా ఉండాలని…. విశాఖ రాజధాని ప్రకటనను వ్యతిరేకించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం విశాఖలో పర్యటించిన చంద్రబాబు కాన్వాయ్ పై కొందరు కోడిగుడ్లు, చెప్పులతో దాడులకు దిగారు. టమాటాలను విసిరారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా చైతన్యయాత్రలను’ ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగానే విశాఖకు రాగా.. విశాఖను వ్యతిరేకించిన చంద్రబాబుకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది.

చంద్రబాబు ఎయిర్ పోర్టులో దిగగానే వైసీపీ శ్రేణులు, ప్రజాసంఘాలు ఆయనను అడ్డుకున్నాయి. ఇక చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు విసిరారు.

ఇక చంద్రబాబును ఎయిర్ పోర్టు నుంచి కదలనీయకుండా కాన్వాయ్ ముందు వైసీపీ శ్రేణులు, ప్రజాసంఘాలు బైటాయించాయి. విశాఖ రాజధానికి అనుకూలంగా చంద్రబాబు ప్రకటన చేశాకనే ర్యాలీ తీయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

విశాఖ ఎయిర్ పోర్టులోనే బాబు కాన్వాయ్ నిలిచిపోయింది. 1000 మంది నిరసనకారులు భైటాయించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టి కాన్వాయ్ ను పంపించారు. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణను సైతం నిరసనకారులు అడ్డుకున్నారు.

First Published:  27 Feb 2020 3:50 AM GMT
Next Story