Telugu Global
NEWS

“ఉత్తరాంధ్రలో అమరావతి” బెడిసికొట్టిందే.. ఇప్పుడేం చేద్దాం?

ఉత్తారంధ్రలో పర్యటించి.. అమరావతికి అనుకూలంగా తమ వాదన వినిపించాలని అనుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఆయన విశాఖకు వెళ్లడం.. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రజా సంఘాల నేతలు అడ్డుకోవడం.. తర్వాత ఆందోళనలు.. చంద్రబాబు అరెస్టు, విడుదల… వంటి చర్యలను టీడీపీ నేతలు రాజకీయం చేసేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేశారు. కానీ.. వారికి కంఠశోష తప్ప మిగిలింది ఏదీ లేకుండా పోయింది. ఆఖరికి ఉత్తరాంధ్రకు చెందిన నేతలు ఒకరిద్దరు తప్ప.. మిగతా ఎవరూ అండగా […]

“ఉత్తరాంధ్రలో అమరావతి” బెడిసికొట్టిందే.. ఇప్పుడేం చేద్దాం?
X

ఉత్తారంధ్రలో పర్యటించి.. అమరావతికి అనుకూలంగా తమ వాదన వినిపించాలని అనుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఆయన విశాఖకు వెళ్లడం.. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రజా సంఘాల నేతలు అడ్డుకోవడం.. తర్వాత ఆందోళనలు.. చంద్రబాబు అరెస్టు, విడుదల… వంటి చర్యలను టీడీపీ నేతలు రాజకీయం చేసేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేశారు. కానీ.. వారికి కంఠశోష తప్ప మిగిలింది ఏదీ లేకుండా పోయింది.

ఆఖరికి ఉత్తరాంధ్రకు చెందిన నేతలు ఒకరిద్దరు తప్ప.. మిగతా ఎవరూ అండగా నిలబడకపోవడం.. విశాఖలోనూ సెంట్రల్ ఆంధ్రా టీడీపీ బ్యాచ్ నేతలే మెజారిటీగా చంద్రబాబు వెంట ఉండడం లాంటి పరిణామాలు.. ఆ పార్టీకే ఇబ్బందిని కలిగించాయి. ఇంత వివాదం జరిగినా కూడా.. రెగ్యులర్ నాయకులే ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబును వెనకేసుకు వచ్చారు తప్ప.. తమ పార్టీ వాదనను బలంగా వినిపించగల ఉత్తరాంధ్ర నాయకులు.. సొంత పార్టీకి అండగా నిలబడని వైనం.. టీడీపీకి ఆశ్చర్యకరంగా పరిణమించింది.

ఇదే.. టీడీపీ అధినేత చంద్రబాబును ఆలోచనలో పడేసినట్టుగా సమాచారం. ఉత్తరాంధ్రలో అమరావతి వాదనను సమర్థంగా వినిపించలేని పరిస్థితిని ఎలా అధిగమించాలన్నదే వారి ముందు నిలిచిన పెద్ద సవాల్ అయ్యింది. ఇతర విషయాలపై దృష్టి పెట్టి ప్రజల్లోకి వెళ్లాలా.. లేదంటే ఇదే విషయాన్ని ఇంకాస్త పెద్ద వివాదంగా మార్చాలా… అన్నది కూడా టీడీపీలో స్పష్టత లేకుండా పోతోంది.

ఉన్న ఫళంగా.. పార్టీకి ఇమేజ్ తీసుకురాగలిగే నిర్ణయాలు, పోరాటలపైనే టీడీపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో అమరావతి మాదిరిగా కాకుండా.. మరో విషయంతో అధికార పార్టీని ఇరుకున పెట్టాలన్నదే టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది.

First Published:  28 Feb 2020 8:00 AM GMT
Next Story