Telugu Global
NEWS

ఔదార్యం చాటుకున్న సీఎం కేసీఆర్... వికలాంగ వృద్ధుడికి సాయం..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఔదార్యాన్ని మరో సారి చాటుకున్నారు. రోడ్డు పక్కన దరఖాస్తు పట్టుకున్న వికలాంగుడైన వృద్ధుడిని చూసి తన కాన్వాయ్ ఆపించి మరీ అతడిని కలిశారు. ఆ వృద్ధుడు అడిగిన సాయాన్ని చేశారు. వివరాల్లోకి వెళితే.. సీఎం కేసీఆర్ హైదరాబాద్ టోలీచౌకీలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి తిరిగి తన కాన్వాయ్‌లో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో సలీమ్ అనే వికలాంగ వృద్ధుడు దరఖాస్తు పట్టుకొని రోడ్డు పక్కన నిల్చోవడం గమనించారు. వెంటనే తన […]

ఔదార్యం చాటుకున్న సీఎం కేసీఆర్... వికలాంగ వృద్ధుడికి సాయం..!
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఔదార్యాన్ని మరో సారి చాటుకున్నారు. రోడ్డు పక్కన దరఖాస్తు పట్టుకున్న వికలాంగుడైన వృద్ధుడిని చూసి తన కాన్వాయ్ ఆపించి మరీ అతడిని కలిశారు. ఆ వృద్ధుడు అడిగిన సాయాన్ని చేశారు. వివరాల్లోకి వెళితే..

సీఎం కేసీఆర్ హైదరాబాద్ టోలీచౌకీలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి తిరిగి తన కాన్వాయ్‌లో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో సలీమ్ అనే వికలాంగ వృద్ధుడు దరఖాస్తు పట్టుకొని రోడ్డు పక్కన నిల్చోవడం గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌ని ఆపి సలీమ్ దగ్గరకు స్వయంగా వెళ్లారు. ఆయన సమస్య ఎంటో సాంతం అడిగి తెలుసుకున్నారు.

తన పేరు సలీమ్ అనీ.. గతంలో డ్రైవర్‌గా పని చేశానని ఆయన సీఎంకి చెప్పారు. తనకు 9 ఏండ్ల నుంచి అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. నాలుగేళ్ల క్రితం బిల్డింగ్ పైనుంచి పడి కాలు విరిగిందని చెప్పారు. తన కొడుకు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. ఉండటానికి ఇల్లులేదని కాస్త సాయం చేయమని కోరాడు.

వృద్ధుడి కష్టాలకు చలించిపోయిన సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. సలీమ్ సమస్యలను పరిష్కరించాలని.. వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిని ఆదేశించారు. అంతే కాకుండా అతడికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్లారు.

సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ శ్వేతా మహంతి కొద్ది సేపటికే సలీమ్ ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. వృద్ధుడి వివరాలను పరిశీలించి స్వయంగా నిర్థారించుకున్నారు. అంతే కాకుండా అప్పటికే అతడికి సదరం సర్టిఫికేట్ ఉన్నట్లు గమనించి వెంటనే 3,016 రూపాయల పెన్షన్ మంజూరు చేసి ఫిబ్రవరి నెల పెన్షన్‌ను అక్కడికక్కడే మంజూరు చేశారు. అంతే కాకుండా జియాగూడలో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించారు.

మరోవైపు వృద్ధుని కొడుకు చికిత్స కోసం సీఎం సహాయ నిధి కింద నిధులు మంజూరు చేపించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి దరఖాస్తు సిద్దం చేశారు. అంతే కాకుండా సలీమ్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఖర్చులతో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ మీడియాకు తెలిపారు.

సీఎం కేసీఆర్ చేసిన ఒక చిన్న పనితో సలీమ్ కుటుంబం ఇన్నాళ్లు పడిన కష్టాలు తీరిపోయాయని స్థానికులు అంటున్నారు.

First Published:  27 Feb 2020 8:12 PM GMT
Next Story