Telugu Global
NEWS

ప్రపంచకప్ లో భారత్ విజయాల హ్యాట్రిక్

న్యూజిలాండ్ పై 3 పరుగుల గెలుపు గ్రూప్- ఏ టాపర్ గా భారత్ టీ- 20 మహిళా ప్రపంచకప్ లో భారత విజయపరంపర కొనసాగుతోంది. గ్రూప్ -ఏ లీగ్ లో భారత్ వరుసగా మూడో విజయంతో సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకొంది. పెర్త్ లోని వాకా స్టేడియం వేదికగా ముగిసిన గ్రూప్ మూడో రౌండ్ పోటీలో న్యూజిలాండ్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న భారత్ 3 పరుగుల విజయం నమోదు చేసింది. గ్రూప్- ఏ తొలిరౌండ్లో ప్రపంచ చాంపియన్ […]

ప్రపంచకప్ లో భారత్ విజయాల హ్యాట్రిక్
X
  • న్యూజిలాండ్ పై 3 పరుగుల గెలుపు
  • గ్రూప్- ఏ టాపర్ గా భారత్

టీ- 20 మహిళా ప్రపంచకప్ లో భారత విజయపరంపర కొనసాగుతోంది. గ్రూప్ -ఏ లీగ్ లో భారత్ వరుసగా మూడో విజయంతో సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకొంది.

పెర్త్ లోని వాకా స్టేడియం వేదికగా ముగిసిన గ్రూప్ మూడో రౌండ్ పోటీలో న్యూజిలాండ్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న భారత్ 3 పరుగుల విజయం నమోదు చేసింది.

గ్రూప్- ఏ తొలిరౌండ్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియా, రెండోరౌండ్లో బంగ్లాదేశ్, మూడోరౌండ్లో న్యూజిలాండ్ ను ఓడించిన భారత్… ఆఖరి రౌండ్లో శ్రీలంకతో తలపడాల్సి ఉంది.

మెరిసిన షఫాలీ వర్మ….

ఈ కీలకమ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగుల స్కోరు సాధించింది. ఓపెనర్ షఫాలీ వర్మ 34 బాల్స్ లో 4 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 46 పరుగుల స్కోరుతో టాప్ స్కోరర్ గా నిలిచింది. తాన్యా భాటియా 23, పూనమ్ యాదవ్ 10 పరుగుల స్కోర్లతో భారత్ ను ఆదుకొన్నారు.

సమాధానంగా…134 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన కివీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 3 పరుగుల విజయంతో… భారత్ విజయాల హ్యాట్రిక్ ను పూర్తి చేయగలిగింది.

భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన యువ ఓపెనర్ షఫాలీవర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. భారతజట్టు ప్రపంచకప్ సెమీస్ చేరడం ఇది మూడోసారి. గ్రూప్- ఏ ఆఖరిరౌండ్లో శ్రీలంకతో భారత్ తలపడాల్సి ఉంది.

గ్రూప్ -ఏ లీగ్ మరో పోటీలో ఆస్ట్ర్రేలియా నెగ్గి…రెండు విజయాలతో సెమీస్ బెర్త్ కు మరింత చేరువయ్యింది. గ్రూప్- బీ లీగ్ లో ప్రపంచ మాజీ చాంపియన్ వెస్టిండీస్ పై పాకిస్థాన్ సంచలన విజయం సాధించింది.

First Published:  28 Feb 2020 1:10 AM GMT
Next Story