పిల్లల కోసం కాదు, సినిమాల కోసం గ్యాప్

సమంత కొత్తగా ఎలాంటి తెలుగు సినిమాలు ప్రకటించలేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న 2 పరభాషా చిత్రాల్ని కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అనుకుంటోంది. జాను తర్వాత సమంత ఇలా ఒక్కసారిగా ఖాళీ అయిపోవడం ఏంటంటూ చాలామంది ఆరాలు తీశారు. అదే సమయంలో సమంత గర్భవతి అయిందని, అందుకే ఈ గ్యాప్ అంటూ ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే దీన్ని ఖండిస్తూ ఇప్పుడు మరో కొత్త పుకారు ప్రచారంలోకి వచ్చింది.

సమంత గ్యాప్ తీసుకుంది పిల్లల కోసం కాదట. నిర్మాతగా మారేందుకు సమంత గ్యాప్ తీసుకుందట. భర్త నాగచైతన్యతో కలిసి సినిమాలు నిర్మిస్తానని సమంత ఇదివరకే ప్రకటించింది. చెప్పినట్టుగానే ఈ వేసవిలో కొత్త నిర్మాణ సంస్థను ప్రకటించబోతోందట సమంత. దీనికి సంబంధించి నాగచైతన్య, సమంత కలిసి ఓ టైటిల్ కూడా అనుకున్నారట.

ఇక్కడితో ఈ పుకార్లు ఆగలేదు. ఓ కొత్త కుర్రాడు చెప్పిన స్టోరీలైన్ కు కూడా సమంత-నాగచైతన్య కలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ ప్రాజెక్టును కూడా తమ బ్యానర్ లాంఛ్ తో పాటు ప్రకటించబోతున్నారట. ఈ వార్తలన్నీ ఎంత వరకు నిజమో తెలియాలంటే మార్చి నెలాఖరు వరకు ఆగితే సరిపోతుంది. ఎఁదుకంటే.. ఈ నెల రోజుల్లో సమంత కొత్త సినిమా ప్రకటిస్తే.. నిర్మాణ సంస్థ ప్రకటన ఇప్పట్లో లేనట్టే. ప్రకటించకపోతే, అప్పటికి బ్యానర్ పై ఓ క్లారిటీ రావడం ఖాయం.