భీష్మ ఫస్ట్ వీక్ కలెక్షన్

విడుదలైన 5 రోజులకే బ్రేక్-ఈవెన్ అయింది భీష్మ. వారం తిరగకుండానే బయ్యర్లంతా లాభాలు కళ్లజూస్తున్నారు. అలా బ్లాక్ బస్టర్ హిట్ అయిన భీష్మ.. నిన్నటితో ఫస్ట్ వీక్ పూర్తిచేసుకుంది. ఈ 7 రోజుల్లో సినిమాకు వరల్డ్ వైడ్ 50 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 23 కోట్ల 32 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఏపీ, నైజాంలోని అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. అటు ఓవర్సీస్ లో 8లక్షల 10వేల డాలర్ల వసూళ్లతో స్ట్రాంగ్ గా కొనసాగుతూ.. మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరేందుకు దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 7 రోజుల్లో వచ్చిన షేర్స్ ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 7.47 కోట్లు
సీడెడ్ – రూ. 2.83 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.53 కోట్లు
ఈస్ట్ – రూ. 1.47 కోట్లు
వెస్ట్ – రూ. 1.09 కోట్లు
గుంటూరు – రూ. 1.52 కోట్లు
నెల్లూరు – రూ. 0.60 కోట్లు
కృష్ణా – రూ. 1.19 కోట్లు