హిట్ మొదటి రోజు వసూళ్లు

సినిమాకు సంబంధించి మన జానర్ ప్రేక్షకులు ఎవరో తెలుసుకోవడం చాలా అవసరం. మన హీరో మార్కెట్ ఎంతో తెలుసుకోవడం ఇంకా అవసరం. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకొని బడ్జెట్ పెడితే నష్టాలనేవి దాదాపు రావు. నాని ఇదే పని చేశాడు. విశ్వక్ సేన్ మార్కెట్ పై అతడికి ఓ అంచనా ఉంది. పైగా అతడు తీసిన హిట్ సినిమా జానర్ పై కూడా పూర్తి క్లారిటీ ఉంది. అందుకే రిలీజ్ కు తగ్గట్టే ఈ సినిమాకు వసూళ్లు వచ్చాయి.

హిట్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలకు అమ్మారు. మొదటి రోజు ఈ సినిమాకు కోటి 25 లక్షల రూపాయల షేర్ వచ్చింది. మంచి టాక్ కారణంగా ఈరోజు, రేపు కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. కట్ చేస్తే.. సోమవారం నాటికి ఈ సినిమా దాదాపు 80శాతం రికవరీ అయ్యే అవకాశాలున్నాయని ట్రేడ్ చెబుతోంది.

పనిలోపనిగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా ఈజీ అంటోంది ట్రేడ్. తక్కువ థియేటర్లలో రిలీజ్ అయినప్పటికీ.. తక్కువ రేట్లకు అమ్మడం, హిట్ టాక్ రావడంతో 10 రోజుల్లో బయ్యర్లంతా సేఫ్ జోన్ లోకి వచ్చేస్తారనేది ఓ అంచనా.

ఈ సినిమా నైజాం, ఉత్తరాంధ్ర హక్కుల్ని దిల్ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో హిట్ సినిమాకు తొలి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 66 లక్షలు
సీడెడ్ – 9 లక్షలు
ఉత్తరాంధ్ర -12 లక్షలు
ఈస్ట్ – 5 లక్షలు
వెస్ట్ – 6 లక్షలు
గుంటూరు – 15 లక్షలు
నెల్లూరు – 4 లక్షలు
కృష్ణా – 8 లక్షలు