రీఎంట్రీ పవన్…. ఆ కల నెరవేరుతుందా?

రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ అయిన పవన్ కళ్యాణ్… సినిమాల్లోకి రాను రాను అంటూనే మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. దిల్ రాజ్ తో ఒక మూవీ, క్రిష్ దర్శకత్వంలో మరో మూవీని చేస్తున్నాడు.

క్రిష్ తో చేస్తున్న మూవీ వేగంగా సాగుతోంది. ఈ మూవీ కోసం భారీ సెట్లు, చాలా పెద్ద బడ్జెట్ తో సినిమా తెరకెక్కిస్తున్నారట.. ఈ సినిమాలోని అద్భుతమైన కథా కథనం దృష్ట్యా ఈ సినిమాను తెలుగులోనే కాదు.. ఇతర భాషలు, హిందీలో కూడా రిలీజ్ చేయాలని క్రిష్ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిసింది.

హిందీలో రిలీజ్ చేయాలని యోచించిన క్రిష్ ఇందులో ముఖ్యమైన విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను తీసుకున్నట్టు తెలిసింది. ఇక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నండేజ్ ను తీసుకుంటున్నాడట.

ఇప్పటికే గబ్బర్, మణికర్ణిక లాంటి సినిమాలతో క్రిష్ హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడే. క్రిష్ తాజాగా రెండు ఫ్లాప్ లు తీసినప్పటికీ… చాలా గ్యాప్ తర్వాత ఏఎం రత్నం ఈ చిత్రం కోసం భారీగా ఖర్చు చేస్తూ నిర్మిస్తున్నాడు. చారిత్రక నేపథ్యంలోనే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.