Telugu Global
NEWS

'గడువు 16 నెలలే.... పోలవరాన్ని పూర్తి చేయాల్సిందే'

ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టుపై….  రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రాజెక్టు పనుల తీరును పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్.. వచ్చే ఏడాది జూన్ లోపు నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే అని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సత్వర అనుమతుల కోసం ఢిల్లీలో ఓ అధికారి అందుబాటులో ఉండాలని.. నిధులను అందించే బాధ్యత తాము తీసుకుంటామని సీఎం చెప్పారు. పునరావాస, సహాయ కార్యక్రమాలపైనా ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. నిధులు కావాలంటే పూర్తి వివరాలతో రావాలని.. సత్వరమే […]

గడువు 16 నెలలే.... పోలవరాన్ని పూర్తి చేయాల్సిందే
X

ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టుపై…. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రాజెక్టు పనుల తీరును పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్.. వచ్చే ఏడాది జూన్ లోపు నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే అని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సత్వర అనుమతుల కోసం ఢిల్లీలో ఓ అధికారి అందుబాటులో ఉండాలని.. నిధులను అందించే బాధ్యత తాము తీసుకుంటామని సీఎం చెప్పారు.

పునరావాస, సహాయ కార్యక్రమాలపైనా ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. నిధులు కావాలంటే పూర్తి వివరాలతో రావాలని.. సత్వరమే మంజూరు చేయిస్తానని చెప్పారు. పనుల విషయంలో నిర్లక్ష్యం వద్దని అధికారులకు స్పష్టం చేసిన సీఎం.. నిర్మాణాలతో పాటు.. పునరావాస చర్యలు సమాంతరంగా పూర్తి కావాల్సిందేనని దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా.. పనుల తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

స్పిల్ వే ముందు నిర్మించాల్సిన కీలకమైన బ్రిడ్జ్ ను.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ తో అనుసంధానం చేస్తున్నామని సీఎంకు అధికారులు చెప్పారు. జూన్ నాటికి ప్రధాన కుడి కాలువ కనెక్టివిటీ పూర్తవుతుందని స్పష్టం చేశారు. అధికారుల శ్రమను ప్రశంసిచిన సీఎం.. గడువులోగా పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది జూన్ కు పోలవరం నీటిని పొలాలకు పారించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు.

First Published:  28 Feb 2020 11:25 PM GMT
Next Story