Telugu Global
NEWS

రంజీట్రోఫీలో సెమీస్ సమరం

బెంగాల్ తో కర్ణాటక, గుజరాత్ తో సౌరాష్ట్ర్ర అమీతుమీ దేశవాళీ రంజీ (2019-20 సీజన్ )ట్రోఫీ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీ సమరంలో ఆఖరి నాలుగుజట్ల సెమీస్ పోరుకు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్, రాజ్ కోట్ సౌరాష్ట్ర్ర క్రికెట్ స్టేడియాలు వేదికగా తెరలేచింది. జమ్మూ వేదికగా ముగిసిన క్వార్టర్ ఫైనల్స్ లో జమ్మూ-కాశ్మీర్ ను కర్నాటక చిత్తు చేసి వరుసగా మూడోసారి సెమీస్ బెర్త్ సంపాదించింది. జమ్మూ- కాశ్మీర్ ను కర్నాటక 167 పరుగుల తేడాతో […]

రంజీట్రోఫీలో సెమీస్ సమరం
X
  • బెంగాల్ తో కర్ణాటక, గుజరాత్ తో సౌరాష్ట్ర్ర అమీతుమీ

దేశవాళీ రంజీ (2019-20 సీజన్ )ట్రోఫీ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీ సమరంలో ఆఖరి నాలుగుజట్ల సెమీస్ పోరుకు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్, రాజ్ కోట్ సౌరాష్ట్ర్ర క్రికెట్ స్టేడియాలు వేదికగా తెరలేచింది.

జమ్మూ వేదికగా ముగిసిన క్వార్టర్ ఫైనల్స్ లో జమ్మూ-కాశ్మీర్ ను కర్నాటక చిత్తు చేసి వరుసగా మూడోసారి సెమీస్ బెర్త్ సంపాదించింది.

జమ్మూ- కాశ్మీర్ ను కర్నాటక 167 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బ్యాటింగ్ లో సిద్ధార్ధ,బౌలింగ్ లో ఆఫ్ స్పిన్నర్ గౌతమ్ కర్నాటక విజయంలో ప్రధానపాత్ర వహించారు. కర్నాటక జట్టులో కెఎల్ రాహుల్, మనీష్ పాండే, కరుణ్ నాయర్, ప్రసిద్ధ కృష్ణ లాంటి మేటి ఆటగాళ్లున్నారు.

కటక్ సమీపంలోని టంగీ వేదికగా జరిగిన మరో క్వార్టర్ ఫైనల్స్ లో ఒడిషాపై బెంగాల్ తొలిఇన్నింగ్స్ ఆధిక్యతన విజేతగా నిలవడం ద్వారా సెమీస్ లో అడుగుపెట్టింది.

తొలిక్వార్టర్ ఫైనల్స్ లో గోవాను ఓడించడం ద్వారా గుజరాత్ సెమీఫైనల్స్ కు అర్హత సాధించింది. 2006-07 సీజన్లో చివరిసారిగా రంజీఫైనల్స్ చేరిన బెంగాల్…రెండు సీజన్ల విరామం తర్వాత మరోసారి సెమీఫైనల్స్ చేరుకోగలిగింది. ఇషాన్ పోరెల్, ముకేశ్ కుమార్,ఆకాశ్ దీప్ లతో కూడిన పేస్ ఎటాక్ తో పవర్ ఫుల్ కర్నాటకకు బెంగాల్ సవాలు విసురుతోంది.
రంజీట్రోఫీ సెమీఫైనల్స్ పోరు ఐదురోజులపాటు జరుగనుంది.

First Published:  28 Feb 2020 9:00 PM GMT
Next Story