Telugu Global
Cinema & Entertainment

రెడ్ టీజర్ రివ్యూ

సినిమాపై అంచనాలు పెంచడం ఒకెత్తు. ఓవర్ గా అంచనాలు పెంచకుండా చేయడం మరో ఎత్తు. ఈ రెండో విషయంలో రామ్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తన సినిమాపై అనవసరంగా అంచనాలు పెంచడం లేదు ఈ హీరో. అందుకే నిన్న రిలీజైన టీజర్ లో మేటర్ మొత్తం డీటెయిల్డ్ గా చెప్పేశాడు. అదే రెడ్ మూవీ. ఈ సినిమా టీజర్ రిలీజైంది. సినిమాలో రామ్ రెండు పాత్రలు పోషిస్తున్నాడని… ఆదిత్య, సిద్దార్థ్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే విషయాన్ని టీజర్ […]

రెడ్ టీజర్ రివ్యూ
X

సినిమాపై అంచనాలు పెంచడం ఒకెత్తు. ఓవర్ గా అంచనాలు పెంచకుండా చేయడం మరో ఎత్తు. ఈ రెండో విషయంలో రామ్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తన సినిమాపై అనవసరంగా అంచనాలు పెంచడం లేదు ఈ హీరో. అందుకే నిన్న రిలీజైన టీజర్ లో మేటర్ మొత్తం డీటెయిల్డ్ గా చెప్పేశాడు. అదే రెడ్ మూవీ.

ఈ సినిమా టీజర్ రిలీజైంది. సినిమాలో రామ్ రెండు పాత్రలు పోషిస్తున్నాడని… ఆదిత్య, సిద్దార్థ్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే విషయాన్ని టీజర్ లోనే చెప్పేశారు. అంతేకాదు, కథలో ట్విస్ట్ మొత్తం ఈ రెండు పాత్రల మధ్యే ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పేశారు. నిజానికి ఇది టీజర్ లా లేదు. సినిమా కథ మొత్తం విప్పేసిన ట్రయిలర్ గా ఉంది.

ఇంత చేసినా కథకు సంబంధించి అసలు విషయాన్ని మాత్రం దాచేశారు. ఓ క్రైమ్ విషయంలో సిద్దార్థ్, ఆదిత్య ఒకరికొకరు తారసపడతారు. ఎవరు ఎవర్ని ఇబ్బంది పెట్టారనేది సినిమా. నివేత పెతురాజ్, ఐశ్వర్య అయ్యర్, మాళవిక శర్మ పాత్రల్ని కూడా టీజర్ లో పరిచయం చేశారు. క్రైమ్ హిస్టరీలోనే ఇలాంటి కేసు చూడడం ఇదే ఫస్ట్ టైమ్ అనే డైలాగ్ తో సినిమాపై ఆసక్తి రేకెత్తించారు.

టీజర్ లో మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. అతడి సీనియారిటీ మొత్తం టీజర్ లో కనిపించింది. పాటలు కూడా కచ్చితంగా బాగుండే అవకాశం ఉంది. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 9న థియేటర్లలోకి వస్తోంది రెడ్.

First Published:  28 Feb 2020 9:21 PM GMT
Next Story