Telugu Global
NEWS

అయ్యన్న కుమారుడి పెళ్ళి వేడుకకు... చంద్రబాబు అందుకే హాజరు కాలేదా?

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ వివాహానికి హాజరయ్యారు. అదే రోజు బెంగళూరులో మరో వివాహానికి వెళ్లారు. అంటే.. రాష్ట్రానికి అటో సరిహద్దు, ఇటో సరిహద్దు దాటి వెళ్లి మరీ వివాహాలకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కానీ.. ఎందుకో మరి విశాఖలోని భోగాపురంలో.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడి వివాహ వేడుకకు ఆయన హాజరు కాలేదు. ఈ సీన్ ఇక్కడ కట్ చేద్దాం. కాస్త వెనక్కు వెళితే.. ఇటీవల విశాఖలో చంద్రబాబు […]

అయ్యన్న కుమారుడి పెళ్ళి వేడుకకు... చంద్రబాబు అందుకే హాజరు కాలేదా?
X

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ వివాహానికి హాజరయ్యారు. అదే రోజు బెంగళూరులో మరో వివాహానికి వెళ్లారు. అంటే.. రాష్ట్రానికి అటో సరిహద్దు, ఇటో సరిహద్దు దాటి వెళ్లి మరీ వివాహాలకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కానీ.. ఎందుకో మరి విశాఖలోని భోగాపురంలో.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడి వివాహ వేడుకకు ఆయన హాజరు కాలేదు. ఈ సీన్ ఇక్కడ కట్ చేద్దాం.

కాస్త వెనక్కు వెళితే.. ఇటీవల విశాఖలో చంద్రబాబు పెద్ద సీనే నడిపించారు. ఆందోళనలతో సాగరతీరాన్ని హీటెక్కించారు. ఈ వేడిని చల్లార్చేందుకు ఆయనకు లోకల్ జిల్లా లీడర్లు గంటా శ్రీనివాసరావు లాంటి నేతలు ఏ మాత్రం మద్దతుగా రాలేదు. ఎవరి దారి వారు చూసుకున్నారు. కానీ.. బాబు గారు మాత్రం విజయవంతంగా.. తన పని కానిచ్చేశారు. విమానాశ్రయం నుంచే వెనుదిరిగారు. ఈ సీన్ కూడా కట్ చేద్దాం.

ఈ రెండు విషయాలు పరిశీలిస్తే.. కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటంటే… విశాఖకు బాబు వచ్చినపుడు గంటా అండ్ కో మద్దతు తెలపలేదు. అదే విశాఖలో అయ్యన్న కుమారుడి వివాహ వేడుకకు గంటా అండ్ కో హాజరవగా బాబు మాత్రం సోషల్ మీడియాలో శుభాకాంక్షలతో సరిపెట్టారు.

ఈ వెడ్ లాక్ సందర్భమే జనానికి కనెక్ట్ కావడం లేదు. అలాగే.. వేరే రాష్ట్రాల్లో వివాహాలకు హాజరైన బాబు…. సొంత రాష్ట్రంలో.. అదీ విశాఖలో.. అది కూడా అయ్యన్నపాత్రుడి వంటి సీనియర్ నేత కుమారుడి వివాహానికి ఎందుకు హాజరు కాలేదో మరి.

మళ్లీ విశాఖకు వెళ్తే లేని పోని అవమానాలు ఎదురవుతాయన్న భయమా.. లేక గంటాను కలవడం ఇష్టం లేకనా.. అని రాజకీయ విశ్లేషకులు ముచ్చటించుకుంటున్నారు.

First Published:  29 Feb 2020 7:02 PM GMT
Next Story