Telugu Global
NEWS

కొహ్లీని పదిసార్లు పడగొట్టిన టిమ్ సౌథీ

21 ఇన్నింగ్స్ గా సెంచరీ లేని విరాట్ ప్రపంచ క్రికెట్ అత్యుత్తమ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీని ..పదోసారి పడగొట్టిన తొలిబౌలర్ గా న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ నిలిచాడు. న్యూజిలాండ్ తో రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా….క్ర్రైస్ట్ చర్చి హాగ్లే ఓవల్ వేదికగా జరుగుతున్నఆఖరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సైతం…సౌధీ బౌలింగ్ లోనే కొహ్లీ 3 పరుగుల స్కోరుకు వెనుదిరిగాడు. సౌధీ స్వింగ్ కు కొహ్లీ ఎల్బీడబ్లుగా దొరికిపోయాడు. విరాట్ కొహ్లీని వన్డేలు […]

కొహ్లీని పదిసార్లు పడగొట్టిన టిమ్ సౌథీ
X
  • 21 ఇన్నింగ్స్ గా సెంచరీ లేని విరాట్

ప్రపంచ క్రికెట్ అత్యుత్తమ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీని ..పదోసారి పడగొట్టిన తొలిబౌలర్ గా న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ నిలిచాడు. న్యూజిలాండ్ తో రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా….క్ర్రైస్ట్ చర్చి హాగ్లే ఓవల్ వేదికగా జరుగుతున్నఆఖరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సైతం…సౌధీ బౌలింగ్ లోనే కొహ్లీ 3 పరుగుల స్కోరుకు వెనుదిరిగాడు. సౌధీ స్వింగ్ కు కొహ్లీ ఎల్బీడబ్లుగా దొరికిపోయాడు.

విరాట్ కొహ్లీని వన్డేలు ఆరుసార్లు, టీ-20 ఫార్మాట్లో ఓసారి అవుట్ చేసిన సౌథీకి…టెస్టుమ్యాచ్ ల్లో పడగొట్టడం ఇది మూడోసారి కావడం విశేషం.

వరుస వైఫల్యాలు…..

టెస్టులు, వన్డేలు, టీ-20 ఫార్మాట్లలో కలసి 70కి పైగా సెంచరీలు బాదిన కొహ్లీకి…. ప్రతి ఐదు ఇన్నింగ్స్ కు ఓ శతకం బాదిన రికార్డు ఉంది. అయితే…క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ ఆడిన గత 21 ఇన్నింగ్స్ లో కొహ్లీకి ఒక్కసెంచరీ లేకపోడం ఓ అరుదైన ఘట్టంగా మిగిలిపోతుంది.

అక్లాండ్ ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన రెండోవన్డేలో కేవలం 15 పరుగుల స్కోరుకే టిమ్ సౌథీ బౌలింగ్ లో కొహ్లీ అవుటయ్యాడు. దీంతో…కేవలం సౌథీ బౌలింగ్ లోనే కొహ్లీ అత్యధికసార్లు అవుటైన రికార్డు మూటగట్టుకొన్నాడు.

వన్డే క్రికెట్లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ రవి రాంపాల్ చేతిలో ఆరుసార్లు అవుటైన కొహ్లీని…ఆ తర్వాత అత్యధికంగా అవుట్ చేసిన బౌలర్లలో తిస్సార పెరీరా, ఆడం జంపా ఉన్నారు. ఈ ఇద్దరూ ఐదేసిసార్లు కొహ్లీ వికెట్ సాధించారు.

ఇంగ్లండ్ బౌలర్లు జేమ్స్ యాండర్సన్, గ్రీమ్ స్వాన్…కొహ్లీని ఎనిమిదిసార్లు పడగొట్టిన రికార్డు సాధించారు.

మోర్నీ మోర్కెల్, ఆడం జంపా, నేథన్ లయన్, రవి రాంపాల్…మూడు ఫార్మాట్లలో కలసి ఏడేసిసార్లు కొహ్లీ వికెట్ ను సాధించిన బౌలర్లుగా ఉన్నారు.

First Published:  29 Feb 2020 9:24 PM GMT
Next Story