ఇతడికి ఎలా అవకాశాలొస్తున్నాయబ్బా!

బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేశాడు. అక్కడ సునీల్ షెట్టికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ఎంతమంది అభిమానులు ఉన్నప్పటికీ నటన పరంగా సునీల్ షెట్టి ఆది నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఏ సన్నివేశానికైనా ఒకే తరహా యాక్టింగ్ చేస్తాడంటూ సెటైర్లు వేసేవాళ్లు కూడా ఉన్నారు. ఇన్ని విమర్శల మధ్య సౌత్ లో దూసుకుపోతున్నాడు ఈ హీరో.

అవును.. సౌత్ లో సునీల్ షెట్టికి వరుసగా అవకాశాలొస్తున్నాయి. ఆ మధ్య సుదీప్ నటించిన పహిల్వాన్ సినిమాలో చాలా పెద్ద రోల్ పోషించాడు ఈ నటుడు. రీసెంట్ గా వచ్చిన దర్బార్ లో అయితే ఏకంగా విలన్ పాత్ర పోషించాడు. ఇప్పుడు మంచు విష్ణు హీరోగా వస్తున్న మోసగాళ్లు సినిమాలో పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు.

నిజానికి సునీల్ కు సౌత్ లో ఫాలోయింగ్ లేదు. తెలుగు ప్రేక్షకుల్లో దాదాపు 50శాతానికి పైగా ఆడియన్స్ కు సునీల్ షెట్టి ఎవరో తెలియదు. దీనికి తోడు దర్బార్ సినిమాలో సునీల్ షెట్టి నటనపై చాలా విమర్శలు చెలరేగాయి. అయినప్పటికీ అతడు అవకాశాలు అందుకుంటూనే ఉన్నాడు. సౌత్ స్క్రీన్ పై కనిపిస్తూనే ఉన్నాడు. పర్ ఫెక్ట్ పీఆర్ టీమ్ ఉంటే ఇలాంటివి సాధ్యమౌతాయేమో.