నితిన్ కు రేటింగ్ ఇచ్చిన వరుణ్ తేజ్

నితిన్, వరుణ్ తేజ్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా బయటపెట్టాడు. భీష్మ సక్సెస్ సెలబ్రేషన్స్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన వరుణ్ తేజ్.. నితిన్ తో ఏడాదిన్నరగా ట్రావెల్ చేస్తున్నానని.. తమ ఫ్రెండ్ షిప్ మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.

“నితిన్ ను చూసి చాలా హ్యాపీ ఫీలవుతున్నా. ఈ మధ్యనే మేం బాగా సన్నిహితులమయ్యాం. అతనితో ఈ స్నేహం కొనసాగాలని కోరుకుంటున్నా. ‘భీష్మ’ను మళ్లీ మళ్లీ చూసి ఇంకా పెద్ద సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నా.”

పవన్ ఫ్యాన్స్ లో నితిన్ కు నంబర్ వన్ స్థానం ఇస్తానంటున్నాడు వరుణ్ తేజ్. నితిన్ అంత డైహార్డ్ ఫ్యాన్ ను తను చూడలేదంటున్నాడు. ఈ సందర్భంగా నితిన్ కు రేటింగ్ కూడా ఇచ్చాడు.

“నేను చిన్నప్పట్నుంచీ కల్యాణ్ బాబాయ్ ఇంట్లో పెరిగాను. రక్త సంబంధం కాబట్టి నేను ఆయనకు అభిమానినవడం పెద్ద విషయం కాదు. కానీ నేను రేటింగ్ ఇస్త్తున్నా.. నితిన్ నంబర్ వన్ పవన్ కల్యాణ్ గారి ఫ్యాన్. కచ్చితంగా నితిన్ కు కల్యాణ్ బాబాయ్ అభిమానుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.”

సింగిల్ ఫరెవర్ అంటూ సినిమా చేసి, రిలీజ్ టైమ్ కు ఎంగేజ్ మెంట్ చేసుకొని నితిన్ అందర్నీ మోసం చేశాడని జోక్ చేశాడు వరుణ్ తేజ్. భీష్మ సినిమాలానే అతడి వైవాహిక జీవితం కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాడు.