Telugu Global
Cinema & Entertainment

హిట్ వారాంతం వసూళ్లు

హిట్ సినిమాకు మంచి రేటింగ్స్ వచ్చాయి. కానీ ఎప్పట్లానే ఈ జానర్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా పనిచేయదనే విషయం మరోసారి రుజువైంది. బ్రేక్ ఈవెన్ అవుతుందనుకున్న ఈ సినిమా ఇంకా ఆ పని పూర్తిచేయలేదు. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు 3 కోట్ల 17లక్షల రూపాయల షేర్ వచ్చింది. నిజానికి మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అవుతుందని అంతా భ్రమించారు. ఎఁదుకంటే ఫస్ట్ డే ఈ సినిమాకు వచ్చిన టాక్, రేటింగ్స్ […]

హిట్ వారాంతం వసూళ్లు
X

హిట్ సినిమాకు మంచి రేటింగ్స్ వచ్చాయి. కానీ ఎప్పట్లానే ఈ జానర్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా పనిచేయదనే విషయం మరోసారి రుజువైంది. బ్రేక్ ఈవెన్ అవుతుందనుకున్న ఈ సినిమా ఇంకా ఆ పని పూర్తిచేయలేదు. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు 3 కోట్ల 17లక్షల రూపాయల షేర్ వచ్చింది.

నిజానికి మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అవుతుందని అంతా భ్రమించారు. ఎఁదుకంటే ఫస్ట్ డే ఈ సినిమాకు వచ్చిన టాక్, రేటింగ్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి మరి. కానీ ఈ జానర్ అన్ని వర్గాలకు సూటయ్యేది కాదు. ఫలితంగా బి, సి సెంటర్లలో ఈ సినిమా ఆక్యుపెన్సీ పడిపోయింది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను పూర్తిగా పక్కనపెట్టారు. అలా మొదటి వారాంతానికి హిట్ సినిమా 80శాతం మాత్రమే రికవరీ అయింది. ఈ 3 రోజుల్లో హిట్ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 1.60 కోట్లు
సీడెడ్ – రూ. 30 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 34 లక్షలు
ఈస్ట్ – రూ. 15 లక్షలు
వెస్ట్ – రూ. 18 లక్షళు
గుంటూరు – రూ. 25 లక్షలు
నెల్లూరు – రూ. 9 లక్షలు
కృష్ణా – రూ. 26 లక్షలు

First Published:  2 March 2020 7:55 AM GMT
Next Story