ఆర్ఆర్ఆర్: టైటిల్ ఇదే.. వైరల్

దేశంలోనే ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, చరణ్ లాంటి అగ్రహీరోలు, బాహుబలి దర్శకుడు రాజమౌళి తీస్తున్న ఈ మూవీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు అసలు టైటిల్ ఏంటో చెప్పకుండా రాజమౌళి సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. ఈ మేరకు చిత్ర యూనిట్ నుంచి లీక్స్ బయటకు వచ్చాయి. చిత్రం ప్రారంభమై సంవత్సరం గడిచిపోయింది. జూలై 30 నుంచి 2021 సంక్రాంతికి రిలీజ్ డేట్ మార్చారు. సంవత్సరం నుంచి ఈ సినిమా నుంచి ఒక్క అప్ డేట్ కూడా లేదు. దీంతో ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ కు ఓ మంచి టైటిల్ సూచించాలని అప్పట్లో ఆర్ఆర్ఆర్ టీం ఫ్యాన్స్ ను కోరింది. దీనికి చాలా మంది వందల పేర్లను పంపారు.

తాజాగా అందులోంచి వచ్చిన ఒక టైటిల్ ను రాజమౌళి ఫిక్స్ చేసినట్టుగా తెలిసింది. ‘రఘుపతి రాఘవ రాజారాం’ టైటిల్ నే ఆర్ఆర్ఆర్ మూవీకి ఖాయం చేసినట్టు తెలిసింది. ఇద్దరు స్టార్ హీరోలు ఉండడం.. వారికి సమప్రాధాన్యం ఇవ్వాల్సి రావడం.. ఎక్కడా గొడవలు లేకుండా ఉండడానికే స్వాతంత్రోద్యమ నినాదాన్నే టైటిల్ గా అనుకుంటున్నట్టు తెలుస్తోంది.