భీష్మకు 10 రోజులు… బయ్యర్లకు లాభాలు

నితిన్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ వచ్చి చేరింది. అతడు నటించిన భీష్మ సినిమా తాజాగా 10 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఇప్పటికే బ్రేక్-ఈవెన్ క్రాస్ చేసిన ఈ సినిమా, ప్రస్తుతం బయ్యర్లందరికీ లాభాలు అందించే పనిలో పడింది. ఇది ఏదో ఒక ఏరియాకు పరిమితం కాదు. ఉత్తరాంధ్ర నుంచి ఓవర్సీస్ వరకు ప్రతి బయ్యర్ కు లాభాలు వస్తున్నాయి.

10 రోజుల్లో భీష్మ సినిమాకు వరల్డ్ వైడ్ 26 కోట్ల 28 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 21 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో మరో మూవీ పోటీలో లేకపోవడంతో భీష్మ సినిమా, నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి. (10 రోజుల షేర్)

నైజాం – రూ. 8.57 కోట్లు
సీడెడ్ – రూ. 3.13 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.86 కోట్లు
ఈస్ట్ – 1.64 కోట్లు
వెస్ట్ – రూ. 1.21 కోట్లు
గుంటూరు – రూ. 1.73 కోట్లు
నెల్లూరు – రూ. 0.72 కోట్లు
కృష్ణా – రూ. 1.44 కోట్లు