Telugu Global
NEWS

ఒలింపిక్స్ అర్హత బాక్సింగ్ కు భారత్ రెడీ

జోర్డాన్ చేరుకొన్న మేరీ కేమ్ అండ్ కో… చైనా వేదికగా జరగాల్సిన ఒలింపిక్స్ అర్హత బాక్సింగ్ పోటీలను… కరోనా వైరస్ దెబ్బతో… అరబ్ దేశం జోర్డాన్ వేదికగా నిర్వహించడానికి ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ఏర్పాట్లు చేసింది. అమ్మాన్ వేదికగా జరిగే ఈ పోటీలలో పాల్గొనటానికి 13 మంది సభ్యుల భారత బాక్సర్ల బృందం…మేరీ కోమ్ నాయకత్వంలో జోర్డాన్ చేరుకొంది. ఈ పోటీల ద్వారా.. వివిధ విభాగాలలో మొత్తం 63 ఒలింపిక్స్ కోటా బెర్త్ లను ఖరారు చేయనున్నారు. అమిత్ పంగల్ […]

ఒలింపిక్స్ అర్హత బాక్సింగ్ కు భారత్ రెడీ
X
  • జోర్డాన్ చేరుకొన్న మేరీ కేమ్ అండ్ కో…

చైనా వేదికగా జరగాల్సిన ఒలింపిక్స్ అర్హత బాక్సింగ్ పోటీలను… కరోనా వైరస్ దెబ్బతో… అరబ్ దేశం జోర్డాన్ వేదికగా నిర్వహించడానికి ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ఏర్పాట్లు చేసింది.

అమ్మాన్ వేదికగా జరిగే ఈ పోటీలలో పాల్గొనటానికి 13 మంది సభ్యుల భారత బాక్సర్ల బృందం…మేరీ కోమ్ నాయకత్వంలో జోర్డాన్ చేరుకొంది. ఈ పోటీల ద్వారా.. వివిధ విభాగాలలో మొత్తం 63 ఒలింపిక్స్ కోటా బెర్త్ లను ఖరారు చేయనున్నారు.

అమిత్ పంగల్ కు టాప్ సీడింగ్….

ఒలింపిక్స్ అర్హత బాక్సింగ్ పురుషుల విభాగం 52 కిలలో విభాగం బరిలోకి దిగుతున్న భారత బాక్సర్ అమిత్ పంగల్ కు టాప్ సీడింగ్ దక్కింది. మహిళల 51 కిలోల విభాగంలో భారత ఎవర్ గ్రీన్ బాక్సర్ మేరీకేమ్ కు రెండోసీడింగ్ ఇచ్చారు.

వివిధ విభాగాలలో భారత్ కు చెందిన ఎనిమిది మంది పురుషులు, ఐదుగురు మహిళలు తమ అదృష్టం పరీక్షించుకొంటున్నారు.

మహిళల 69 కిలోల విభాగంలో లవ్ లీనా బోర్గెయిన్ రెండు, 75 కిలోల విభాగంలో పూజా రాణి నాలుగు సీడింగ్స్ సంపాదించారు.

పురుషుల 63 కిలోల విభాగంలో మనీష్ కౌశిక్, 69 కిలోల విభాగంలో వికాస్ కిషన్, మహిళల 57 కిలోల విభాగంలో సాక్షీ చౌదరీ బరిలోకి దిగుతున్నారు.

First Published:  2 March 2020 8:45 PM GMT
Next Story