నక్సలైట్ గా చిరంజీవి… కొరటాల కథ లీక్?

కొరటాల శివ.. కమర్షియల్ సినిమాల్లో సామాజిక అంశాలను జోడించి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు. కొరటాల తీసిన సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు తాజాగా చిరంజీవితో తీసే సినిమాలోనూ కొరటాల శివ మరో సామాజిక అంశాన్ని తీసుకున్నారట.. ఇప్పుడా కథ వైరల్ గా మారింది.

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘ఆచార్య’ టైటిల్ అనుకుంటున్నట్టు మెగా స్టార్ చిరంజీవి తాజాగా తెలిపారు. ఈ కోవలోనే ఈ సినిమాలో చిరంజీవి లుక్ ఒకటి ఫొటో బయటకు వచ్చింది. అదిప్పుడు వైరల్ గా మారింది.

చిరంజీవి లుక్ చూశాకే ఇందులో నక్సలైట్ పాత్రలో కనిపిస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతీ చిత్రంలోనూ ఏదో ఒక అంశాన్ని హైలెట్ చేసే కొరటాల… ఈ సినిమాలో తాజాగా అటవీ భూముల పరిరక్షణపై పోరాడే ఓ మాజీ నక్సలైట్ కథాంశాన్ని తీసుకున్నాడని తెలుస్తోంది.

చిరంజీవి ఇందులో ఓ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడట.. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం.