Telugu Global
CRIME

దారి తప్పిన భర్తకు... ‘దిశ’ చూపించిన భార్య!

దిశ యాప్. మహిళల భద్రతలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పేందుకు.. మహిళలకు రక్షణలో సంపూర్ణ భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపిస్తున్న ఈ యాప్ తో.. సత్ఫలితాలు రావడం మొదలైంది. దారి తప్పిన ఓ వ్యక్తిని.. ఏకంగా అతని భార్యే దిశ యాప్ ద్వారా పోలీసులకు పట్టించింది. ఈ ఘటన.. గుంటూరు జిల్లా పరిధిలో వెలుగుచూసింది. తాడేపల్లికి చెందిన ఓ విద్యార్థినిని.. అనిల్ అనే వ్యక్తి వేధించేవాడు. అతనికి అప్పటికే […]

దారి తప్పిన భర్తకు... ‘దిశ’ చూపించిన భార్య!
X

దిశ యాప్. మహిళల భద్రతలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పేందుకు.. మహిళలకు రక్షణలో సంపూర్ణ భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపిస్తున్న ఈ యాప్ తో.. సత్ఫలితాలు రావడం మొదలైంది. దారి తప్పిన ఓ వ్యక్తిని.. ఏకంగా అతని భార్యే దిశ యాప్ ద్వారా పోలీసులకు పట్టించింది. ఈ ఘటన.. గుంటూరు జిల్లా పరిధిలో వెలుగుచూసింది.

తాడేపల్లికి చెందిన ఓ విద్యార్థినిని.. అనిల్ అనే వ్యక్తి వేధించేవాడు. అతనికి అప్పటికే పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. అయినా.. వక్రబుద్ధి చూపే అనిల్.. ఓ విద్యార్థినిపై కన్నేసి.. ఆమెను నిత్యం వెంబడించేవాడు. మాయమాటలు చెప్పి లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. ఇతడిని నమ్మిన సదరు అమ్మాయి.. ఓ సారి అతన్ని కలిసేందుకు వెళ్లింది. అనిల్ కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తున్న అతని భార్య.. ఈ విషయాన్ని గుర్తించింది.

ఇద్దరూ కలిసి బైక్ పై వెళ్తుండగా చూసి.. దిశ యాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించింది. ఇంకేముంది.. పోలీసులు వెంటనే స్పందించారు. అనిల్ వెంట ఉన్న అమ్మాయిని కాపాడారు. అతడిని కటకటాల్లోకి తోశారు. 4 నెలలుగా ఆ అమ్మాయిని వేధిస్తున్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి.. తాడేపల్లి పోలీసులకు ఆ కేసును బదలాయించారు. దిశ యాప్ తో ఓ మహిళ… తన భర్తను పట్టించిన వైనాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు.

ఈ సంఘటన మాత్రమే కాదు.. భద్రత పరంగా ఎంతో ఉపయుక్తమైన ఈ దిశ యాప్ ను.. మహిళలు అంతా వాడాల్సిన అవసరం ఉంది. తద్వారా.. తమ భద్రతపై సమయంతో సంబంధం లేకుండా.. ఎప్పుడైనా భరోసాగా ఉండే అవకాశం ఏర్పడుతుంది.

First Published:  3 March 2020 4:03 AM GMT
Next Story