Telugu Global
NEWS

తెలంగాణలో మరో సంచలనం... కారెక్కనున్న దుద్దిళ్ల?

తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి.. మంచికి పోతే చెడు ఎదురైన పరిస్థితే కనిపిస్తోంది. ఎటు చూసినా.. ఆ పార్టీ తెలంగాణ ఏర్పాటు సమయం నుంచి కునారిల్లిపోతోంది. టీఆర్ఎస్ కు దక్కుతున్న ప్రజాదరణ ముందు.. కేసీఆర్ రాజకీయ చతురత ముందు కాంగ్రెస్ ఎత్తులు తేలిపోతున్నాయి. ప్రస్తుతం ఆ పార్టీని తెలంగాణలో గట్టిగా నడిపించే నాయకుడే లేకుండా పోయాడు. ఇంతలో.. మరో వార్త.. ఆ పార్టీని ఆందోళనలో పడేస్తోంది. ప్రస్తుతం తెలంగాణకు పీసీసీ చీఫ్ ను మార్చే కసరత్తు […]

తెలంగాణలో మరో సంచలనం... కారెక్కనున్న దుద్దిళ్ల?
X

తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి.. మంచికి పోతే చెడు ఎదురైన పరిస్థితే కనిపిస్తోంది. ఎటు చూసినా.. ఆ పార్టీ తెలంగాణ ఏర్పాటు సమయం నుంచి కునారిల్లిపోతోంది. టీఆర్ఎస్ కు దక్కుతున్న ప్రజాదరణ ముందు.. కేసీఆర్ రాజకీయ చతురత ముందు కాంగ్రెస్ ఎత్తులు తేలిపోతున్నాయి. ప్రస్తుతం ఆ పార్టీని తెలంగాణలో గట్టిగా నడిపించే నాయకుడే లేకుండా పోయాడు. ఇంతలో.. మరో వార్త.. ఆ పార్టీని ఆందోళనలో పడేస్తోంది.

ప్రస్తుతం తెలంగాణకు పీసీసీ చీఫ్ ను మార్చే కసరత్తు జరుగుతోంది. పదవి నుంచి తప్పుకొంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడో ప్రకటించేశారు. ఆయన్ను ఏఐసీసీ లోకి తీసుకుంటారన్న ప్రచారం ఉంది. మరోవైపు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డికి తోడు.. దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు కూడా.. పీసీసీకి కాబోయే కొత్త చీఫ్ ఆశావహుల లిస్ట్ లో వినిపించింది. ఇంతలోనే.. ఈ నాలుగు పేర్లలో ఒకరైన దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. కారెక్కుతారన్న ఊహాగానాలు.. తెలంగాణ కాంగ్రెస్ ను షేక్ చేస్తున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలామంది టీఆర్ఎస్ గూటికి చేరారు. సీఎల్పీనే ఏకంగా కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. ఉన్న ఎమ్మెల్యేల్లో శ్రీధర్ బాబు కూడా ఒకరు. ఆయన కారెక్కాలని తీసుకున్న నిర్ణయానికి వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉంటున్నట్టు సమాచారం. కార్యకర్తలు అడిగినా ఏ సమాధానం చెప్పకుండా ఉంటున్నారట. ఇంతలో వార్త బయటికొచ్చింది.

మరి నిజంగానే.. దుద్దిళ్ల శ్రీధర్ బాబు హస్తానికి హ్యాండ్ ఇస్తారా.. కారు స్టీరింగ్ పట్టుకుంటారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన వాళ్ల పరిస్థితి ఆలోచించాకే.. దుద్దిళ్ల తుది నిర్ణయం తీసుకోవాలన్న సలహా.. ఆయనకు ప్రస్తుత సొంత పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

First Published:  3 March 2020 4:00 AM GMT
Next Story