రిచా బాటలో నికీషా పటేల్

సినిమాలు చేస్తూ చేస్తూ ఒక్కసారిగా మానేసింది రిచా గంగోపాధ్యాయ. అట్నుంచి అటు అమెరికా వెళ్లిపోవడం, లవ్ లో పడిపోవడం, పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడిదే బాటలో మరో హీరోయిన్ కూడా చేరింది. ఆమె పేరు నికీషా పటేల్. పవన్ నటించిన కొమరం పులి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ, ఇప్పుడు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. లండన్ చెక్కేసింది. ఇక అన్నీ అక్కడే.

“నమ్మండి, ఇది చాలా కష్టమైన నిర్ణయం. ఇలా ఆలోచించటానికే ఇబ్బందైంది కానీ తప్పదు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందే. సౌత్ సినిమాలతో విసుగెత్తిపోయాను. బ్రిటిష్ టెలివిజన్ షోలో నాకు ఓ గుర్తింపు వచ్చింది. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఏజెన్సీ గిల్బర్ట్ తో ఒప్పందం కుదుర్చుకున్నాను. లండన్ కు షిఫ్ట్ అయిపోతున్నాను. ఇక నుంచి లండన్ లోనే నా మకాం. నాకు మంచి భవిష్యత్తు ఉంటుందనిపిస్తోంది.”

ఇలా సౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది నికీషా పటేల్. నిజానికి తను బాలీవుడ్ సినిమాల్లో నటించడం కోసం లండన్ నుంచి ఇండియా వచ్చానని, కానీ తనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదంటోంది. పైగా సౌత్ నుంచి కూడా తనకు మంచి ఆఫర్లు రావడం లేదని, అందుకే విసుగెత్తి ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతోంది. చూస్తుంటే.. అట్నుంచి అటే ఎవర్నో పెళ్లి చేసుకొని అక్కడే అమ్మడు సెటిలయ్యేలా ఉంది.

Yes I have signed with a leading agency in central london gulbert and payne. And will step into Hollywood soon some exciting news coming!

Publiée par Nikesha patel sur Mardi 3 mars 2020