Telugu Global
Cinema & Entertainment

మంచు మనోజ్ 'అహం బ్రహ్మాస్మి' ఫస్ట్ లుక్

హీరో మంచు మనోజ్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి వస్తున్నాడు. రీసెంట్ గా ‘అహం బ్రహ్మాస్మి’ అనే మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన మనోజ్.. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశాడు. ఈ మూవీ మార్చి 6న గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఫస్ట్ లుక్ లో శివభక్తుని తరహాలో మంచు మనోజ్ కనిపిస్తున్నాడు. పోస్టర్లో మనోజ్ మూడు రకాల హావభావాలు.. హాస్యం, రౌద్రం, శాంతం.. ప్రదర్శిస్తున్నాడు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్ కు […]

మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి ఫస్ట్ లుక్
X

హీరో మంచు మనోజ్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి వస్తున్నాడు. రీసెంట్ గా ‘అహం బ్రహ్మాస్మి’ అనే మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన మనోజ్.. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశాడు. ఈ మూవీ మార్చి 6న గ్రాండ్ గా లాంచ్ కానుంది.

ఫస్ట్ లుక్ లో శివభక్తుని తరహాలో మంచు మనోజ్ కనిపిస్తున్నాడు. పోస్టర్లో మనోజ్ మూడు రకాల హావభావాలు.. హాస్యం, రౌద్రం, శాంతం.. ప్రదర్శిస్తున్నాడు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్ కు అద్దం పట్టే విధంగా ఆ లుక్స్ ఉన్నాయి.

శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రాబోతోంది ‘అహం బ్రహ్మాస్మి’. ఈ సినిమా కోసం మంచు మనోజ్ సొంతంగా ఓ బ్యానర్ పెట్టాడు. తనే నిర్మాతగా మారి ఈ సినిమా తీస్తున్నాడు.

First Published:  4 March 2020 11:29 AM GMT
Next Story