Telugu Global
NEWS

తెలంగాణకు కరోనా... అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (కొవిడ్-19) వైరస్ తెలంగాణకు విస్తరించింది. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కరోనాపై ఆందోళనతో ఉన్నారు. కనీసం ఒకరికొకరు షేక్ హాండ్ ఇచ్చేందుకూ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొరుగునే ఉన్న.. ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అప్రమత్తమైంది. ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పిస్తోంది. ఈ వైరస్ కారణంగా రాష్ట్రానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ప్రజలు ఆందోళన పడవద్దని భరోసా […]

తెలంగాణకు కరోనా... అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్
X

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (కొవిడ్-19) వైరస్ తెలంగాణకు విస్తరించింది. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కరోనాపై ఆందోళనతో ఉన్నారు. కనీసం ఒకరికొకరు షేక్ హాండ్ ఇచ్చేందుకూ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొరుగునే ఉన్న.. ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అప్రమత్తమైంది. ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పిస్తోంది. ఈ వైరస్ కారణంగా రాష్ట్రానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

ప్రజలు ఆందోళన పడవద్దని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ముందస్తుగా ప్రత్యేక గదులు, మందులు సిద్ధం చేశామని.. ఏ మాత్రం అనారోగ్యంతో ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో వ్యాధులను దూరం చేసుకోవచ్చన్న ఆళ్ల నాని.. ఆ దిశగా ప్రజలు జాగ్రత్త పడాలని చెప్పారు. ప్రస్తుతానికైతే కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంలో నమోదు కాలేదని వెల్లడించారు.

మరోవైపు.. అధికారులు కూడా ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమయ్యారు. విమానాశ్రయాల్లో థర్మల్ స్కానర్లతో ప్రయాణికులను పరీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా.. 0866 2410978 నంబరును అందుబాటులోకి తెచ్చారు. ఎలాంటి అనుమానాలున్నా ఈ నంబరుకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలని చెప్పారు. ఎలాంటి అత్యవసర స్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు.

కరోనా వైరస్ ముందస్తు నివారణ దిశగా ప్రజలు సహకరించాలని ఉన్నాతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాము అమలు చేస్తున్న కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

First Published:  3 March 2020 7:42 PM GMT
Next Story