Telugu Global
Cinema & Entertainment

గుండె జారి ఒరేయ్ బుజ్జిగా అయినట్టుందే

కొద్దిసేపటి కిందట విడుదలైంది ఒరేయ్ బుజ్జిగా టీజర్. రాజ్ తరుణ్ ఇందులో హీరోగా నటించాడనే విషయాన్ని పక్కనపెడితే.. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత విజయ్ కుమార్ కొండా డైరక్ట్ చేసిన సినిమాగా దీన్ని ఎక్కువమంది చూస్తున్నారు. ఎందుకంటే గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో ఈ దర్శకుడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. అయితే ఒరేయ్ బుజ్జిగా టీజర్ చూసిన ప్రేక్షకులకు మరోసారి గుండెజారి గల్లంతయ్యిందే సినిమానే గుర్తొచ్చింది. అందులో కథ మొత్తం ఫోన్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో కూడా […]

గుండె జారి ఒరేయ్ బుజ్జిగా అయినట్టుందే
X

కొద్దిసేపటి కిందట విడుదలైంది ఒరేయ్ బుజ్జిగా టీజర్. రాజ్ తరుణ్ ఇందులో హీరోగా నటించాడనే విషయాన్ని పక్కనపెడితే.. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత విజయ్ కుమార్ కొండా డైరక్ట్ చేసిన సినిమాగా దీన్ని ఎక్కువమంది చూస్తున్నారు. ఎందుకంటే గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో ఈ దర్శకుడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి.

అయితే ఒరేయ్ బుజ్జిగా టీజర్ చూసిన ప్రేక్షకులకు మరోసారి గుండెజారి గల్లంతయ్యిందే సినిమానే గుర్తొచ్చింది. అందులో కథ మొత్తం ఫోన్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో కూడా హీరో ఫోన్ కోసం పరుగెత్తే సీన్ టీజర్ లో ఉంది. అందులో హీరో ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోతాడు. ఇందులో హీరో హీరోకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. గుండెజారి సినిమాలో ఓ సున్నితమైన ట్విస్ట్ ఉంది. టీజర్ చూస్తుంటే.. ఒరేయ్ బుజ్జిగా సినిమాలో కూడా అలాంటిదే ఓ సున్నితమైన ట్విస్ట్ ఉన్నట్టుంది.

ఇలా ఈ రెండు సినిమాల మధ్య చాలా పోలికలైతే కనిపిస్తున్నాయి. అదే మేజిక్ రిపీట్ అయితే ఈ సినిమా కూడా హిట్టయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమా సక్సెస్ దర్శకుడికే కాదు, హీరోకు కూడా అత్యంత అవసరం. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న రిలీజ్ చేస్తున్నారు

First Published:  4 March 2020 11:27 AM GMT
Next Story