శాకాహారిగా మారిన రష్మిక

హీరోయిన్ రష్మిక పూర్తి శాకాహారిగా మారింది. ఈ విషయాన్ని తనే అధికారికంగా ప్రకటించింది. రీసెంట్ గా తను పూర్తి శాకాహారిగా మారిపోయానని, ఇకపై వెజిటేరియన్ మాత్రమే తింటానని రష్మిక స్పష్టంచేసింది.

“అవును.. నేను పూర్తిగా శాకాహారిగా మారిపోయాను. ప్రతి రోజూ నేను మాంసాహారం తింటాను. కానీ ఇప్పుడు పూర్తిగా మానేయాలని నిర్ణయించుకున్నాను. ఇక నుంచి పూర్తి వెజిటేరియన్ లైఫ్ ప్రారంభిస్తున్నాను.”

ప్రస్తుతం రష్మిక టాప్ లీగ్ లో ఉంది. తెలుగులో పూజా హెగ్డేకు పోటీనిస్తున్న ఒకేఒక్క హీరోయిన్ రష్మిక మాత్రమే. పైగా ఆమెకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఫిజిక్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా రాబోయే మూడేళ్లు చాలా కీలకం. అందుకే రష్మిక వ్యూహాత్మకంగా నాన్-వెజ్ మానేసింది. తన గ్లామర్ ను మరింత పెంచుకోవడం కోసం, ఫిజిక్ ను పెర్ ఫెక్ట్ గా మెయింటైన్ చేయడం కోసం పూర్తి శాకాహారిగా మారిపోయింది.

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకుంది రష్మిక. త్వరలోనే బన్నీ-సుకుమార్ సినిమాలో నటించనుంది. దీంతో పాటు నాగచైతన్య ఆఫర్ కూడా రెడీగా ఉంది.