Telugu Global
NEWS

కరోనా ఎఫెక్ట్: విశాఖకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్

విశాఖ సాగర తీరాన్ని కూడా కరోనా పరోక్షంగా తాకింది. ఓ చేదు వార్తను.. విశాఖ వాసులకు మిగిల్చింది. నావికాదళం ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో మరికొద్ది రోజుల్లో జరగాల్సి ఉన్న వేడుకకు.. కరోనా వైరస్ నిర్దాక్షిణ్యంగా బ్రేకులు వేసింది. వేడుక పేరు.. మిలాన్. మార్చి 18 నుంచి 28 వరకు 11 రోజుల పాటు ఈ ఉత్సవం జరగాల్సి ఉంది. మునుపెన్నడూ లేనంతగా.. 32 దేశాల నావికాదళాలు విన్యాసాలు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖ తీరం వేదికగా […]

కరోనా ఎఫెక్ట్: విశాఖకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్
X

విశాఖ సాగర తీరాన్ని కూడా కరోనా పరోక్షంగా తాకింది. ఓ చేదు వార్తను.. విశాఖ వాసులకు మిగిల్చింది. నావికాదళం ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో మరికొద్ది రోజుల్లో జరగాల్సి ఉన్న వేడుకకు.. కరోనా వైరస్ నిర్దాక్షిణ్యంగా బ్రేకులు వేసింది.

వేడుక పేరు.. మిలాన్. మార్చి 18 నుంచి 28 వరకు 11 రోజుల పాటు ఈ ఉత్సవం జరగాల్సి ఉంది. మునుపెన్నడూ లేనంతగా.. 32 దేశాల నావికాదళాలు విన్యాసాలు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖ తీరం వేదికగా ఈ విన్యాసాల నిర్వహణకు భారత నౌకాదళం అనూహ్య స్థాయిలో ఏర్పాట్లనూ పూర్తి చేసింది. విశాఖ వాసులు, పర్యటకులు.. ఈ వేడుకలు చూడాలని ఎదురు చూస్తున్నారు.

కానీ.. ఊహలకందని రీతిలో ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్.. ఈ మిలాన్ ఉత్సవంపై ప్రభావం చూపింది. కరోనా కారణంగానే.. మిలాన్ వేడుకను వాయిదా వేస్తున్నట్టు నావికాదళ అధికార ప్రతినిధి, కమాండర్ వివేక్ మధ్వల్ మంగళవారం ప్రకటించారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత.. అనువైన సమయం చూసుకుని మిలాన్ ను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి అగ్ర రాజ్యాల నావికాదళాలు ఇప్పటికే మిలాన్ విన్యాసాలకు సిద్ధమయ్యాయి. భారత నేవీ కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరింది. కానీ.. అనుకోకుండా ఎదురైన కరోనా ముప్పు.. ఈ ఉత్సాహాన్ని చల్లార్చింది.

First Published:  3 March 2020 7:47 PM GMT
Next Story