Telugu Global
Cinema & Entertainment

మరో బ్లాక్ బస్టర్ కోసం బన్నీ ప్లాన్ అదుర్స్...

ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన బన్నీ ‘అల వైకుంఠపురం’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇప్పుడు అల వైకుంఠపురం కంటే మెరుగైన హిట్ కోసం అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడట.. భారీ కలెక్షన్లు సాధించడానికి ఈ అవకాశాన్ని మలుచుకుంటున్నాడట. అల వైకుంఠపురాన్ని మంచి సీజన్ అయిన సంక్రాంతికి రిలీజ్ చేసి బన్నీ మంచి పనిచేశాడు. ఈ సినిమా తనకు పోటీ అయిన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని అధిగమించి మంచి వసూళ్లు […]

మరో బ్లాక్ బస్టర్ కోసం బన్నీ ప్లాన్ అదుర్స్...
X

ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన బన్నీ ‘అల వైకుంఠపురం’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇప్పుడు అల వైకుంఠపురం కంటే మెరుగైన హిట్ కోసం అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడట.. భారీ కలెక్షన్లు సాధించడానికి ఈ అవకాశాన్ని మలుచుకుంటున్నాడట.

అల వైకుంఠపురాన్ని మంచి సీజన్ అయిన సంక్రాంతికి రిలీజ్ చేసి బన్నీ మంచి పనిచేశాడు. ఈ సినిమా తనకు పోటీ అయిన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని అధిగమించి మంచి వసూళ్లు సాధించింది. నాన్ బాహుబలిని రికార్డులను సృష్టించింది. ఇప్పుడు అలాంటి మంచి సీజన్ ను అల్లు అర్జున్ దొరకబుచ్చుకుంటున్నారు. భారీ కలెక్షన్ల కోసం ఖాళీగా ఉన్న సంక్రాంతి సీజన్ పై కన్నేశాడు.

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ సంక్రాంతి 2021కు వాయిదా పడింది. దీంతో చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాల విడుదల తేదీని సంక్రాంతి నుంచి మార్చారు. చిరంజీవి ‘ఆచార్య’ కూడా 2021 మార్చికి వాయిదాపడింది.

దీంతో ఈ సంవత్సరం ఎండింగ్ నెలల్లో అసలు ఏ పెద్ద చిత్రం లేకుండా పోయింది. అందుకే ఈ సంవత్సరం చివరలో తన సినిమాను రిలీజ్ చేసి కలెక్షన్లు కొల్లగొట్టాలని బన్నీ ప్లాన్ చేసినట్టు సమాచారం.

దసరా సీజన్ కే తన సినిమాను రిలీజ్ చేయాలని బన్నీ ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ ఏడాది చివరలో ఏ పెద్ద సినిమాలు లేవు. దీంతో అభిమానులు సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. ఆ అవకాశాన్ని వాడుకోవాలని బన్నీ భావిస్తున్నాడు. అయితే సినిమాను కనీసం సంవత్సరం, రెండేళ్లు తీసే సుకుమార్ అంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేస్తాడా? అన్నది సందేహంగా మారింది.

First Published:  5 March 2020 2:51 AM GMT
Next Story