Telugu Global
Cinema & Entertainment

బిగ్ బాస్ విజేత రాహుల్ పై దాడి

బిగ్ బాస్ సీజన్-3 విజేతగా పాపులర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ పై రాత్రి దాడి జరిగింది. తీవ్ర గాయాలతో అతడు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తలకు మాత్రం బలమైన గాయం అయిందని చెబుతున్నారు వైద్యులు. నిన్నరాత్రి తన ఫ్రెండ్స్ తో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్ కు వెళ్లాడు రాహుల్. అక్కడే ఉన్న మరో గ్రూప్ రాహుల్ బ్యాచ్ పై కన్నేసింది. రాహుల్ బ్యాచ్ లో […]

బిగ్ బాస్ విజేత రాహుల్ పై దాడి
X

బిగ్ బాస్ సీజన్-3 విజేతగా పాపులర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ పై రాత్రి దాడి జరిగింది. తీవ్ర గాయాలతో అతడు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తలకు మాత్రం బలమైన గాయం అయిందని చెబుతున్నారు వైద్యులు.

నిన్నరాత్రి తన ఫ్రెండ్స్ తో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్ కు వెళ్లాడు రాహుల్. అక్కడే ఉన్న మరో గ్రూప్ రాహుల్ బ్యాచ్ పై కన్నేసింది. రాహుల్ బ్యాచ్ లో ఉన్న ఓ అమ్మాయితో కొంతమంది అసభ్యంగా ప్రవర్తించారట. దీనిపై రాహుల్ వాళ్లను హెచ్చరించాడట. అంతే.. ఒక్కసారిగా వాళ్లు రాహుల్ పై తిరగబడ్డారు. తమ చేతిలో ఉన్న బీర్ బాటిల్స్ తో రాహుల్ తలపై బలంగా కొట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది.

దగ్గర్లోనే ఉన్న పోలీసులు వెంటనే ఆ గొడవను ఆపారు. రాహుల్ ను ఆస్పత్రికి తరలించారు. జరిగిన ఘటనపై రాహుల్ ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పోలీసులు మాత్రం సుమోటోగా ఈ కేసు తీసుకొని ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. రాహుల్ పై దాడికి పాల్పడిన వ్యక్తులు ఓ ఎమ్మెల్యేకు దగ్గర బంధువులు అని సమాచారం. రాహుల్ కోలుకున్న తర్వాత ఈ గొడవపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

First Published:  4 March 2020 10:58 PM GMT
Next Story