Telugu Global
Cinema & Entertainment

చెప్పిన తేదీకే ఆచార్య

చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోంది ఆచార్య సినిమా. ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయాలనేది ప్లాన్. కాకపోతే అధికారికంగా ప్రకటించలేదనుకోండి. అది వేరే విషయం. అయితే తాజాగా ఈ ప్రాజెక్టులోకి మహేష్ బాబు వచ్చిచేరిన సంగతి తెలిసిందే. అతడి రాకతో సినిమా షూటింగ్ డేస్ మరిన్ని పెరుగుతాయని, తద్వారా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయి, సినిమా విడుదల వాయిదా పడొచ్చని పుకార్లు వ్యాపించాయి. రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించని యూనిట్, ఈ […]

చెప్పిన తేదీకే ఆచార్య
X

చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోంది ఆచార్య సినిమా. ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయాలనేది ప్లాన్. కాకపోతే అధికారికంగా ప్రకటించలేదనుకోండి. అది వేరే విషయం. అయితే తాజాగా ఈ ప్రాజెక్టులోకి మహేష్ బాబు వచ్చిచేరిన సంగతి తెలిసిందే. అతడి రాకతో సినిమా షూటింగ్ డేస్ మరిన్ని పెరుగుతాయని, తద్వారా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయి, సినిమా విడుదల వాయిదా పడొచ్చని పుకార్లు వ్యాపించాయి.

రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించని యూనిట్, ఈ పుకార్లను కూడా అధికారికంగా కాకుండా, అనధికారికంగా ఖండించింది. మహేష్ రాకతో సినిమా లేట్ అవ్వదని, అనుకున్న టైమ్ కే ఆచార్య వచ్చి తీరుతుందని అంటోంది సినిమా యూనిట్. ఈ మేరకు త్వరలోనే అఫీషియల్ గా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

ఆచార్య సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తయింది. మహేష్ వస్తే షూటింగ్ మరింత వేగం పుంజుకుంటుంది. సో.. మహేష్ సెట్స్ పైకి వచ్చిన వెంటనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాలని చూస్తోంది యూనిట్. ఒకవేళ అనుకోని పరిస్థితుల వల్ల సినిమా వాయిదా వేయాల్సి వస్తే మాత్రం అక్టోబర్ కు ఆచార్య షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.

First Published:  4 March 2020 9:11 PM GMT
Next Story